Heroine : కొంతమంది ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంటే మరి కొంతమంది ముద్దుగుమ్మలు అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉండిపోతున్నారు. వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముద్దుగుమ్మ కూడా ఒకటి. ఒకప్పటి హీరోయిన్లు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాలలో మాత్రమే కనిపించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరం అయితే మరి కొంతమంది మాత్రం ఊహించని విధంగా అవకాశాలు రాక సినిమాలకు దూరం అవుతున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందిందే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత సినిమాలలో సహాయక పాత్రలలో కూడా కనిపించింది. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ప్రస్తుతం మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యింది. సినిమాలకు దూరం అయిన కూడా ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్గా తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఆకట్టుకొని రాణించారు. కొంతమంది హీరోయిన్లు కేవలం కొన్ని సినిమాలకే పరిమితం అయ్యారు.
Also Read :గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టూడెంట్ నెంబర్ వన్ హీరోయిన్…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..
ఈ హీరోయిన్ పేరు బిందు మాధవి. తెలుగు అమ్మాయిగా బిందు మాధవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆవకాయ్ బిర్యానీ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో బిందు మాధవికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. బిందు మాధవి తమిళ్లో పొక్కిషన్, కజుగు, కేడి బిల్లా కిల్లాడి రంగా అనే సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమిందార్ వంటి సినిమాలలో కూడా నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
ఇక 2022లో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారమైన ప్రముఖ బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదటి సీజన్లో పాల్గొని విజేతగా కూడా నిలిచింది. ఈ షో తో బిందు మాధవి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే ఈమె సినిమాలలో అంతగా యాక్టివ్ గా ఉండదు. చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం మళ్ళీ ఒక చాలెంజింగ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దండోరా సినిమాతో బిందు మాధవి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బిందు మాధవి వేసే పాత్రలో కనిపించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మురళి కాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram