Bhuvaneswar Kumar : చాలామంది క్రికెటర్ల వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి, పిల్లలు.. ఇవన్నీ కూడా సినిమా కథల మాదిరిగానే ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడానికి.. మనదేశంలో చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాంటి కథే భువనేశ్వర్ కుమార్ ది. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలర్. సౌమ్యమైన వ్యక్తితో ఉన్నవాడు.. ప్రస్తుతం అతడు ఐపిఎల్ లో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు.. స్వింగ్ కింగ్ గా పేరుపొందిన అతడు.. సూపర్బ్ బౌలర్ గా పేరుపొందాడు.. అయితే భువనేశ్వర్ కుమార్ ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ప్రేమ కథ గురించి పేర్కొన్నాడు. అతడి ప్రేమ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. అందులో ఫన్ కూడా ఉంది. వాస్తవానికి భువనేశ్వర్ కుమార్ తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పెద్దగా పంచుకోడు. పైగా అతడు ఎక్కువగా ఎవరితో కలవడు. అందువల్లే అతని గురించి చాలా తక్కువ తెలుసు. మీడియాతో కూడా తక్కువ మాట్లాడుతాడు.. మైదానంలో వికెట్లు పడగొట్టినప్పటికీ పెద్దగా హావ భావాలు ప్రదర్శించడు. నిదానంగా ఉంటాడు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. భువనేశ్వర్ కుమార్ పెద్దగా హడావిడిని ఇష్టపడడు.
Also Read : నరాలు తెగే ఉత్కంఠ.. ఢిల్లీ vs రాజస్థాన్ మ్యాచ్ టై.. గెలుపు ఎవరిని వరించిందంటే?
టీనేజ్లో ప్రేమ..
భువనేశ్వర్ కుమార్ ఇటీవల రణ్ వీర్ అల్లాబాదియా కు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. భువనేశ్వర్ కుమార్ తన చిన్నతనంలో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో నివసించేవాడు. అప్పుడు నుపూర్ నాగర్ తన కుటుంబంతో కలిసి నివసించడానికి డెహ్రాడూన్ ప్రాంతం నుంచి మీరట్ కు మారింది.. నుపూర్ నాగర్ తన కుటుంబంతో భువనేశ్వర్ ఇంట్లో దిగింది. వారు తమ ఇంట్లో దిగినప్పుడు భువనేశ్వర్ కుమార్ వయసు 13 సంవత్సరాలు..నుపూర్ నాగర్ కు 11 సంవత్సరాలు. మొదటిసారి వారిద్దరు ఒకరినొకరు చూసుకోవడం అదే తొలిసారి. అనంతరం వారిద్దరి మధ్య స్నేహం, అది ప్రేమగా మారడం.. పెళ్లిదాకా వెళ్లడం సినిమా కథను తలపించింది. నుపూర్ నాగర్ తో భువనేశ్వర్ చాలా సంవత్సరాల పాటే డేటింగ్ చేశాడు. ఆ తర్వాత 2015లో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 23, 2017న వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. వారిద్దరికీ ప్రస్తుతం ఒక కుమార్తె.. ఇక ఈ సీజన్లో బెంగళూరు జట్టుకు భువనేశ్వర్ కుమార్ ఆడుతున్నాడు. అతడిని బెంగళూరు జట్టు 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.. హైదరాబాద్ జట్టు తరఫున భువనేశ్వర్ 11 సంవత్సరాల పాటు ఆడాడు. ఇక ఈ సీజన్లో బెంగళూరు జట్టు తరఫున ఐదు మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్.. ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే అని వారి కారణాల వల్ల ఈ సీజన్లో తొలి మ్యాచ్ కు భువనేశ్వర్ దూరమయ్యాడు.
Also Read : రాజస్థాన్ పై ఢిల్లీ “సూపర్” విక్టరీ.. ట్రెండింగ్ లో బుమ్రా