Homeట్రెండింగ్ న్యూస్Eshwar Sai : తప్పు ఒప్పుకున్న బాసింగ బలాలు ఈశ్వర్.. అందువల్లే అలా చేశాడట..

Eshwar Sai : తప్పు ఒప్పుకున్న బాసింగ బలాలు ఈశ్వర్.. అందువల్లే అలా చేశాడట..

Eshwar Sai : ఇటీవల వేములవాడలో హోటల్లో మాధురి రాథోడ్ అనే యువతితో తన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ప్రముఖ జానపద గేయాల డాన్సర్ ఈశ్వర్ సాయి. ఈ ఘటన తర్వాత అతడి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ ను పట్టుకున్న తర్వాత అతడి భార్య మాధురి మీద దాడి చేసింది. తీవ్రంగా కొట్టింది. ఈ ఘటన జరిగిన తర్వాత విలేకరుల సమావేశంలో ఈశ్వర్ సాయి […]

Eshwar Sai : ఇటీవల వేములవాడలో హోటల్లో మాధురి రాథోడ్ అనే యువతితో తన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ప్రముఖ జానపద గేయాల డాన్సర్ ఈశ్వర్ సాయి. ఈ ఘటన తర్వాత అతడి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ ను పట్టుకున్న తర్వాత అతడి భార్య మాధురి మీద దాడి చేసింది. తీవ్రంగా కొట్టింది.

ఈ ఘటన జరిగిన తర్వాత విలేకరుల సమావేశంలో ఈశ్వర్ సాయి భార్య మాట్లాడింది. తన భర్త అటువంటివాడు కాదని.. కనీసం అతడు మద్యం కూడా తాగడని.. అతడిని మాధురి రాథోడ్ పూర్తిగా మార్చేసిందని ఆరోపించింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మళ్ళీ తన స్వరాన్ని మార్చుకుంది.. మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయిని మీడియా వదిలేయాలని.. వారిద్దరిమీద ఇప్పటివరకు ప్రసారం చేసిన కథనాలను మొత్తం డిలీట్ చేయాలని.. వారిద్దరి ప్రేవసికి మీడియా గౌరవం ఇవ్వాలని కోరింది.. చేసింది మొత్తం చేసిన తర్వాత.. జరగాల్సింది మొత్తం జరిగిపోయిన తర్వాత.. ఇప్పుడు చింతించి ఏం లాభమని ఈశ్వర్ సాయి భార్యను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

ఇప్పుడు ఈశ్వర్ సాయి తెరమీదికి వచ్చాడు. భార్య ఉన్న తర్వాత తాను ఇలా చేయడం సరైనది కాదని అతడు అంగీకరించాడు. తాను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు. తనకు ఇటువంటి పరిస్థితి ఒత్తిడి వల్ల వచ్చిందని చెప్పాడు. అనేక రకాల కారణాల వల్ల తాను ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. మరోవైపు ఈశ్వర్ సాయి భార్య దాడి చేసిన నేపథ్యంలో మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేములవాడ పోలీస్ స్టేషన్లో ఆమె ఈశ్వర్ సాయి భార్య మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు.

ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ అనేక విజయవంతమైన పాటలలో నటించారు. వీరిద్దరూ నటించిన పాటలు యూట్యూబ్లో సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. వీరిద్దరికి ఫోక్ ఇండస్ట్రీలో సూపర్ జోడి అనే పేరు ఉంది. గతంలో మాధురి రాథోడ్ ఒక యువకుడిని ప్రేమించింది. చాలా రోజులపాటు వీరి వ్యవహారం సాగింది. ఆ తర్వాత బ్రేకప్ అయింది. అప్పుడు ఈశ్వర్ సాయి భార్య ఆమెకు అండగా నిలిచింది. ఇంట్లో సభ్యురాలిగా ట్రీట్ చేసింది. అయితే ఆ తర్వాత ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్ బుట్టలో వేసుకుందని.. ఆమె ఆరోపించింది. ఇటీవల మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయి కదలికల మీద దృష్టి పెట్టింది. చివరికి వారిద్దరిని దొరక పట్టింది. ఫలితంగా ఈ వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper