Eshwar Sai: గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా లో ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ వ్యవహారం ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా వీళ్లిద్దరి గురించే చర్చ. ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ ఒక రూమ్ లో ఉండగా , రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం వల్ల ఈ ముగ్గురి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈశ్వర్ సాయి కనిపించకుండా పోయాడు. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇక ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఒంటరై , తన భర్త ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసింది. రీసెంట్ గా ఆమె మీడియా కి విడుదల చేసిన ఒక ఆడియో రికార్డు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచనలనం గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘నాతో ఈశ్వర్ సాయి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు. మాధురి బ్రదర్స్ నన్ను చంపేస్తారు కచ్చితంగా అని భయపడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఈశ్వర్ సాయి కనిపించకుండా పోయేలోపు , అతన్ని చంపేశారేమో అని భయం వేస్తోంది. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. ఒకవేళ ఈశ్వర్ సాయి క్షేమంగా ఎక్కడైనా ఉంటే , అతను మాధురి తోనే ఉండొచ్చు. కానీ నేను చనిపోతాను. నా కొడుకుని మీరే చూసుకోవాలి’ అంటూ శరణ్య ఆ ఆడియో రికార్డు లో మాట్లాడింది. దీనిపై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మీ బ్రతుకు మొత్తం నాశనం అయిపోయిందని అంటున్నారు, మరి ఇదంతా వీడియో రికార్డు చేసి , సోషల్ మీడియా లో అప్లోడ్ చేసినప్పుడు తెలియదా?, సోషల్ మీడియా లో ఎలాంటి ట్రోల్స్ వస్తాయో తెలిసి కూడా అప్లోడ్ చేయడం ఎందుకు?, వ్యక్తిగతం గా మీ మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాలను సోషల్ మీడియా లోకి తీసుకొచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, మరో ఇద్దరి జీవితాలను నాశనం చేశావు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ శరణ్య పై కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఈశ్వర్ సాయి ఎక్కడ ఉన్నాడు?, నిజంగానే అతన్ని మాధురి రాథోడ్ బ్రదర్స్ ఏమైనా చేశారా?, లేదా క్షేమంగా ఉన్నదా?, ఒకవేళ శరణ్య కి ఇన్ని అనుమానాలు ఉంటే , ఎందుకు మాధురి రాథోడ్ బ్రదర్స్ పై పోలీస్ కేసు వెయ్యలేదు? , ఆమె కావాలని పబ్లిసిటీ కోసం డ్రామాలు చేస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ అంశం చుట్టూ ఇంకా ఎన్ని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అనేది.
View this post on Instagram