Madhuri Rathod: గత వారం రోజుల నుండి సోషల్ మీడియా ని ఈశ్వర్ సాయి – మాధురి రాథోడ్ జంట ఒక ఊపు ఊపేసింది అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఈ జంట గురించే చర్చ, ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళ మీద ఎన్నో పేరడీలు కూడా వచ్చాయి. త్వరలో సినిమాల్లో కూడా ఈ అంశంపై పేరడీలు చేస్తారేమో చూడాలి. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు ఈశ్వర్ సాయి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో స్పందిస్తూ ఒక వీడియో ని అప్లోడ్ చేసాడు. ఈ వీడియో లో అతను మాట్లాడుతూ ‘మాధురి తో ఎమోషనల్ రిలేషన్ పెట్టుకున్న విషయం వాస్తవమే, అది చాలా పెద్ద తప్పు, కానీ ఆరోజు నేను ఆమె రూమ్ కి రావడానికి కారణం వాష్ రూమ్ ని ఉపయోగించుకోవడం కోసమే’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తెల్లవారు జామున షూటింగ్ ఉండడం తో , నిద్ర లేచి రెడీ అవ్వడానికి నా రూమ్ లోకి వాష్ రూమ్ దగ్గరకి వెళ్తే, అప్పటికే దాన్ని మా అసిస్టెంట్ ఉపయోగిస్తున్నాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాధురి వాష్ రూమ్ ని ఉపయోగించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా ఈశ్వర్ సాయి మాధురి చెప్పడం వల్లే చెప్పాడని స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది. ఈ ఘటన జరిగిన తర్వాత మాధురి ఈశ్వర్ కి ఫోన్ చేసి ‘ఒక చిన్న వీడియో బైట్ నీ వైపు నుండి ఇవ్వొచ్చు కదా?, మా మధ్య ఉన్నది నిజమైన రిలేషనే , కానీ ఆరోజు రూమ్ లో మేము కలిసి లేమని చెప్పు, వాష్ రూమ్ ఉపయోగించుకోవడం కోసం వచ్చానని చెప్పు’ అని అంటుంది మాధురి రాథోడ్. అందుకు ఈశ్వర్ సాయి ‘జనాలు ఇలా చెప్తే అసలు నమ్మరు, పైగా ట్రోల్ చేస్తారు’ అని చెప్పినా కూడా మాధురి ఒప్పుకోదు, తాను చెప్పినట్టే వినాలి అని పట్టుబట్టడంతో ఈశ్వర్ ఆ వీడియో బైట్ ని ఇచ్చాడు.
అంతే కాదు , కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈశ్వర్ సాయి సతీమణి మాధురి రూమ్ కి వెళ్లి తలుపు కొట్టడం , ఈశ్వర్ ఉన్నాడా అని అడిగినప్పుడు లేదు, క్రింద ఉన్నాడంటూ మాధురి సమాధానం చెప్పడం వంటివి ఉన్నాయి. అంటే ఇక్కడ తప్పు మొత్తం మెజారిటీ మాధురి వైపే ఉంది. పైగా ఈమె ఈశ్వర్ సాయి పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. తనని ఈశ్వర్ సాయి శారీరకంగా బాగా వాడుకున్నది, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసింది . పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈశ్వర్ సాయి పరారీ లో ఉన్నాడు.
View this post on Instagram