Homeఎంటర్టైన్మెంట్Eshwar Sai: అడ్డంగా దొరికిపోయిన ఈశ్వర్ సాయి.. హై డ్రామా కు ఇక తెరపడినట్టే!

Eshwar Sai: అడ్డంగా దొరికిపోయిన ఈశ్వర్ సాయి.. హై డ్రామా కు ఇక తెరపడినట్టే!

Eshwar Sai: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ వ్యవహారం గురించే చర్చ. ఈమధ్య కాలం లో ఇంతటి సంచలనం రేపిన అంశం మరొకటి లేదు అనుకోవచ్చు. ఈ సంఘటనకు ముందు వీళ్లిద్దరి పేర్లు కేవలం సోషల్ మీడియా లో కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే వీళ్లిద్దరు ఒకే రూమ్ లో ఉంటూ పట్టుబడ్డారో అప్పటి నుండి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. […]

Eshwar Sai: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ వ్యవహారం గురించే చర్చ. ఈమధ్య కాలం లో ఇంతటి సంచలనం రేపిన అంశం మరొకటి లేదు అనుకోవచ్చు. ఈ సంఘటనకు ముందు వీళ్లిద్దరి పేర్లు కేవలం సోషల్ మీడియా లో కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే వీళ్లిద్దరు ఒకే రూమ్ లో ఉంటూ పట్టుబడ్డారో అప్పటి నుండి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. అయితే మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి పై పోలీస్ స్టేషన్ లో ‘తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడు’ అంటూ అతని పై ఫిర్యాదు నమోదు చేయడం , పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు మొదలుపెట్టగా, ఈశ్వర్ సాయి కి బెయిల్ మంజూరు అవ్వడం వంటి అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే బెయిల్ వచ్చిన తర్వాత మనస్తాపానికి గురైన మాధురి రాథోడ్ , ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యులు , మాధురి ఫ్యాన్ కి వేలాడుతుండడాన్ని గమనించి , వెంటనే రక్షించారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య విడుదల చేసిన ఒక ఆడియో రికార్డు సంచలనం రేపింది. బెయిల్ వచ్చినప్పటి నుండి ఈశ్వర్ సాయి తనకు అందుబాటులో లేడని , అసలు ఎక్కడ ఉన్నాడో అర్థం కావడం లేదని , మాధురి బ్రదర్స్ ఆయన్ని చెంపేసి ఉంటారేమో అనే భయం గా ఉందని , నా భర్త లేకపోతే నేను బ్రతకలేనంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు ఈశ్వర్ సాయి అందుబాటులోకి వచ్చాడు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సంస్థ అధినేత , ఆయనతో ఫోన్ కాల్ ద్వారా సంబాషించాడు.

నేడు మధ్యాహ్నం ఈశ్వర్ సాయి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈశ్వర్ సాయి తిరిగి రావడం తో , ఆయన భార్య శరణ్య చేసిన ఆరోపణలన్నిటికీ తెర పడినట్టే. ఈశ్వర్ క్షేమంగా ఉన్నాడనే సమాచారం అందరికీ తెలిసిపోయింది. మరి ఇక్కడి నుండి ఈ అంశం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది అనేది చూడాలి. ఈశ్వర్ సాయి తన భార్య శరణ్య ని వదిలేసి మాధురి రాథోడ్ తోనే ఉంటాడా, లేదా మాధురి ని దూరం చేసుకుంటాడా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper