Homeఎంటర్టైన్మెంట్Eshwar Sai Madhuri Rathod: పెళ్ళాం.. ప్రియురాలు వేట.. జరుగుతున్నా ఈశ్వర్ సాయి ఎక్కడ..

Eshwar Sai Madhuri Rathod: పెళ్ళాం.. ప్రియురాలు వేట.. జరుగుతున్నా ఈశ్వర్ సాయి ఎక్కడ..

Eshwar Sai Madhuri Rathod: ఈశ్వర్ సాయి ఎక్కడున్నాడు.. పోలీసులకు మాధురి రాథోడ్ ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేసింది. ఈశ్వర్ సాయి భార్య కూడా తెగ వెతుకులాడుతోంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్.. అతని ఫోన్ లొకేషన్ కూడా ట్రేస్ కావడం లేదు.. కనీసం మనిషి జాడ కూడా కనిపించడం లేదు. ఇంతటి సోషల్ మీడియా జీవితంలో.. టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైన ఈ కాలంలో అతని జాడ కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.. ఇంతకీ ఈశ్వర్ […]

Eshwar Sai Madhuri Rathod: ఈశ్వర్ సాయి ఎక్కడున్నాడు.. పోలీసులకు మాధురి రాథోడ్ ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేసింది. ఈశ్వర్ సాయి భార్య కూడా తెగ వెతుకులాడుతోంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్.. అతని ఫోన్ లొకేషన్ కూడా ట్రేస్ కావడం లేదు.. కనీసం మనిషి జాడ కూడా కనిపించడం లేదు. ఇంతటి సోషల్ మీడియా జీవితంలో.. టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైన ఈ కాలంలో అతని జాడ కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యకరం..

ఇంతకీ ఈశ్వర్ సాయి ఎక్కడున్నాడు.. ఏమైపోయాడు.. ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేదా తను ఏమైనా కఠిన నిర్ణయం తీసుకున్నాడా.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత అతడు కనిపించడం లేదు. వాస్తవానికి ఈశ్వర్ సాయికి ఫోక్ పాటల ద్వారా విపరీతమైన ప్రచారం వచ్చింది. అతడు ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ముఖ్యంగా బాసింగా బలాలు పాటతో అతడు ఎక్కడికి వెళ్లిపోయాడు. అన్ని బాగుంటే రాము రాథోడ్ లాగా తిరుగులేని స్థాయిని అందుకోవాల్సిన అతడు.. పనికిమాలిన పనిచేసి అడ్డంగా దొరికిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తన భార్య ముందు దోషి లాగా నిలబడ్డాడు.

వేములవాడలో ఆరోజు మాధురి రాథోడ్తో రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత.. ఈశ్వర్ సాయి ఒక వీడియో విడుదల చేశాడు. తమ ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు. తను చాలా మంచిదని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మాధురి రాథోడ్ అసలు విషయాన్నీ బయటపెట్టింది. తనకు మంచి మంచి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. మాయమాటలు చెప్పాడ.. పెళ్లి చేసుకుంటానని అన్నాడని.. శారీరకంగా సంబంధం కూడా పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా తనను మోసం చేశాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని మీద చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంతో మాధురి రాథోడ్ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకోవడానికి యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు.

ఆ తర్వాత మళ్లీ ఆమె పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు ఈశ్వర్ సాయి కోసం అతని భార్య కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆమె కూడా పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇటు సిటీ పోలీసులు.. అటు ఈశ్వర్ సాయి స్వస్థలం లో ఉన్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కానీ ఇంతవరకు అతని జాడ కనిపించడం లేదు. ఇంతకీ అతను ఎక్కడున్నాడు.. ఏమైపోయాడు.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్లిపోయాడు..

బంగారం లాంటి భార్య ఉండగా.. ప్రేమకు ప్రతిరూపం లాంటి కుమారుడు ఉండగా మాధురి రాథోడ్ తో అతడు వ్యవహారం ఎందుకు మొదలు పెట్టాడు.. మొదట్లో మాధురి రాథోడ్ తో తనకు ఎటువంటి రిలేషన్ లేదని చెప్పిన అతడు.. ఆ తర్వాత ఎందుకు పారిపోయాడు.. మొదట్లో నోరు విప్పకుండా నిశ్శబ్దంగా ఉన్న మాధురి రాథోడ్.. ఆ తర్వాత తన మధ్య ఆ సంబంధం ఉందని ఎందుకు చెప్పింది.. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేసింది.. వేములవాడ ఘటన తర్వాత మాధురి రాథోడ్ సెల్ఫీ వీడియో తీసుకుంది.. తన ఏదో విభిన్నమైన కంటెంట్ ఇస్తుంటే దాని పక్కనపెట్టి.. దీనిని చూస్తున్నారని కవర్ చేయడం మొదలుపెట్టింది. చివరికి ఈశ్వర్ సాయితో తనకు ఆ సంబంధం ఉందని క్లారిటీ ఇచ్చింది..

మొదట్లో కాదని.. ఇప్పుడు అవునని.. అసలు ఈ సెలబ్రిటీలకు బుర్ర లేదా.. అసలు బుర్రలో మెదడు లేదా.. కాస్త సెలబ్రిటీ తను రాగానే వాళ్ళు ఏమైనా డెమి గాడ్స్ అనుకుంటున్నారా.. సమాజంలో ఈ తరహ వార్తలు వారి గురించి పెరిగిపోతుంటే ఏమీ అనుకోరా.. సెలబ్రెటీలు కాబట్టి కామన్ అని భావిస్తారా.. కానీ ఇంతటి ఎపిసోడ్లో వెర్రి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది చూసే ప్రేక్షకులు మాత్రమే.. ప్రేక్షకుల ధోరణి మారితేనే సెలబ్రిటీలు నేలకు వస్తారు. తాము కూడా మనుషులమని భావిస్తారు. అదిగో అప్పటిదాకా ఈ సెలబ్రిటీల చిల్లర భాగోతాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper