Homeఎంటర్టైన్మెంట్Madhuri Rathod: సంచలనం రేపుతున్న 'మాధురి రాథోడ్' ఆత్మహత్య లేఖ..!

Madhuri Rathod: సంచలనం రేపుతున్న ‘మాధురి రాథోడ్’ ఆత్మహత్య లేఖ..!

Madhuri Rathod: గత వారం పది రోజుల నుండి ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ , వినిపిస్తున్న పేర్లు మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి. గత కొంత కాలం నుండి రిలేషన్ లో ఉంటున్న వీళ్లిద్దరు , ఒకే రూమ్ లో ఉన్నప్పుడు , ఈశ్వర్ సాయి సతీమణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, ఆ తర్వాత ఆమె వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం తో అవి సంచలనంగా మారడం […]

Madhuri Rathod: గత వారం పది రోజుల నుండి ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ , వినిపిస్తున్న పేర్లు మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి. గత కొంత కాలం నుండి రిలేషన్ లో ఉంటున్న వీళ్లిద్దరు , ఒకే రూమ్ లో ఉన్నప్పుడు , ఈశ్వర్ సాయి సతీమణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, ఆ తర్వాత ఆమె వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం తో అవి సంచలనంగా మారడం వంటివి జరిగాయి. అనంతరం ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ లకు సంబంధించిన ఎన్నో ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే మాధురి రాథోడ్ , తీవ్రమైన మనస్తాపానికి గురై , నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఈశ్వర్ సాయి పై ఫిర్యాదు చేసింది.

తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి , శారీరకంగా వాడుకొని , ఇప్పుడు వదిలేశాడని , అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేయగా , ఈశ్వర్ సాయి పరారీ లో ఉన్నట్టు తెలిసింది. అయితే పోలీసులు అతని పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని , తన పరువు మొత్తాన్ని బజారుకి ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఫ్యాన్ కి ఉరేసుకొని వేలాడుతుండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు , వెంటనే తలుపులు బద్దలు కొట్టి , లోపలకు చొరబడి మాధురి ప్రాణాలను కాపాడారు. ఒకవేళ వాళ్ళు కాస్త ఆలస్యం చేసి ఉన్నా ఈరోజు మాధురి రాథోడ్ మన మధ్య ఉండేది కాదు. అయితే ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు మాధురి రాథోడ్ రాసిన చివరి లేఖ , ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.

ఆ లేఖలో ఏముందంటే ‘ముందుగా నా కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. నాకు బ్రతకాలని లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు, నేను ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. నాకు భవిష్యత్తు లేదు , అంతా అయిపోయింది. ఇలాంటి సమయం లో కూడా నా కుటుంబ సభ్యులు నాకు ఎంతో అండగా నిలిచారు. నా అభిమానులు కూడా చాలా సపోర్ట్ గా నిలిచారు. అందుకు ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను , నేను చాలా పెద్ద తప్పు చేశాను, అందుకే దానికి శిక్ష గా చనిపోవాలని అనుకుంటున్నాను. ఇక నేను సమాజం లో ఎవరినీ ఫేస్ చెయ్యలేను, నా క్యారెక్టర్ పోయింది, ఇక బ్రతకాలని ఆశ చచ్చిపోయింది. నేను ఇక వెళ్ళిపోతున్నాను. నా చావుకు కారణం ఈశ్వర్ , శరణ్య , సంధ్య మరియు సోషల్ మీడియా ట్రోల్స్’ అంటూ మాధురి రాథోడ్ ఆ లేఖలో చెప్పుకొచ్చింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper