Comedian Dhanraj: టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ధనరాజ్ జీవితం లో కొన్ని విషాదకరమైన సంఘటనలు ఉన్నాయి. ఒకప్పుడు సినిమాల్లో ఫుల్ బిజీ గా గడిపిన ఆయన , ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ నడుస్తుండడం తో అవకాశాలు బాగా తగ్గిపోయి మళ్లీ బుల్లితెర కి షిఫ్ట్ అయ్యాడు. జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ధనరాజ్, ఇతర ఛానల్స్ లో కూడా ఎంటర్టైన్మెంట్ షోస్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ ఏడాది ఆరంభం లో ఆయన బీబీ జోడీ 2లో పాల్గొన్నాడు.ఇందులో ఆయన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంది. తానూ ఇండస్ట్రీ లోకి ఒక డ్యాన్సర్ గానే అడుగుపెట్టానని, ఫిలిం నగర్ లో ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా స్థాపించానని ఈ షో లో ధనరాజ్ అప్పట్లో చెప్పుకోసిన మాటలు ఈ షో ని చూసిన వారికి గుర్తు ఉండే ఉంటుంది. అయితే ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి ఆయన జీవితం లో ఎదురుకున్న ఒక విషాద సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
రీసెంట్ గా ధనరాజ్ సతీమణి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ధనరాజ్ ఫిలిం నగర్ లో ఒక డ్యాన్స్ స్టూడియో ని పెట్టినప్పుడు, టీచర్ కోసం వెతుకుతూ ఉండేవాడని, ఆ సమయంలో నేను స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో నన్ను కూడా కలిశాడని ,కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, నేను పరిచయమైనా రోజే ధనరాజ్ తల్లి క్యాన్సర్ తో కన్నుమూసిందని , ఆ సమయం లో అంత్యక్రియలకు కూడా అతని వద్ద డబ్బులు లేకపోతే, నా దగ్గరున్న బంగారం ఇచ్చేసానని చెప్పుకొచ్చింది. పెళ్లి కి కూడా ముందుగా తానే ప్రపోజ్ చేసానని , ధనరాజ్ కి కూడా ఇష్టం ఉండడం తో వెంటనే పెళ్లి చేసుకున్నామని, అలాంటి గొప్ప భర్త దొరకడం అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది.