OM Movie: ధనుష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై, మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమాకు భారీ హైప్ ఉండడం తో , టాక్ కూడా కలిసిరావడంతో వరల్డ్ వైడ్ గా బంపర్ ఓపెనింగ్స్ దక్కాయి. ఇండియా వైడ్ గా తెలుగు , తమిళ భాషలకు కలిపి 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , ఓవర్సీస్ నుండి 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ గా 35 కోట్ల గ్రాస్ వచ్చిందని , ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని ట్రేడ్ పండితులు అంటున్నారు.
ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నుండి 12 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ నుండి 5 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కేరళ నుండి 4 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 2 కోట్ల 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 50 లక్షలు, ఓవర్సీస్ నుండి 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టబోతుందో చూడాలి. ఊపు చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ధనుష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లోనే జరిగాయి.