Maruti Brezza Zxi AT: భారత కార్ల మార్కెట్లో ఎస్ యూవీ లకు రోజురోజుకు ఆదరణ పెరిగిపోతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే కాంపాక్ట్ suv ల మీద ఆసక్తి చూపుతున్నాయి. అత్యుత్తమమైన గ్రౌండ్ క్లియరెన్స్.. విశాలమైన క్యాబిన్.. సౌకర్యవంతమైన ప్రయాణం.. అట్రాక్టివ్ డిజైన్ వంటి అంశాలు ఎందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి బ్రేజ్జా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు 2026 మోడల్ లో మరిన్ని ఫీచర్లు.. అప్డేట్ లతో బ్రేజ్జా కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా Maruti brezza Zxi AT వేరియంట్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆటోమెటిక్ గేర్ బాక్స్ కావాలి అనుకునే కుటుంబాలకు ఈ కారు ఎంతవరకు ఉపయోగపడుతుంది.. దీని మైలేజ్ ఏంటి.. ఫీచర్లు ఎలా ఉన్నాయి.. మెయింటెనెన్స్ ఖర్చులు ఎలా ఉంటాయి.. కొనుగోలు చేసిన తర్వాత యజమానులకు ఎలాంటి అనుభవం ఉండొచ్చు.. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2026 Maruti Brezza Zxi AT వేరియంట్ ఎక్స్ షోరూం ధర సుమారు 11.85 లక్షలు. ఇందులో 1.5 లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యాడ్ చేశారు. సిటీ ట్రాఫిక్ లో పదేపదే గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండా సులభంగా డ్రైవ్ చేసుకోవచ్చు.
ఈ కారులో మరో ప్రధాన ఆకర్షణ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వచ్చే ఆటోమేటిక్ గేర్ బాక్స్. నగరాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాన్యువల్ కార్లను నడపడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ మోడల్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండడంవల్ల డ్రైవింగ్ ఈజీ అవుతుంది. ట్రాఫిక్ లో పదే పదే క్లచ్ నొక్కాల్సిన అవసరం ఉండదు. కొత్తగా కారు నడిపే వారికి కూడా ఇది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. హైవేలపై కూడా సాఫీగా ప్రయాణించేందుకు ఈ ఇంజన్ ఉపయోగపడుతుంది.
కారు కొనుగోలు చేసే సమయంలో చాలామంది ముందుగా చూసేది మైలేజ్. Maruti brezza 2026 Zxi AT పై కంపెనీ ప్రకటించిన ARAI certified mileage లీటర్ కు 20.17 కిలోమీటర్లు. వాస్తవ వినియోగంలో ఇది తేడా ఉండే అవకాశం ఉంది.
ఫీచర్లను చూస్తే.. ఎలక్ట్రానిక్ సన్ రూఫ్.. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్.. పుష్ బటన్ స్టార్ట్.. వైర్లెస్ చార్జర్. ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్.. 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు.. రియర్ ఏసి వెంట్స్.. రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో.. ఆపిల్ కార్ ప్లే..
కుటుంబంతో కలిసి ప్రయాణించే వరకు అవసరమైన సౌకర్యాలు మొత్తం ఇందులో కల్పించారు.. ZXi+ వేరియంట్ లో లభించే అన్ని ప్రీమియం ఫీచర్లు ZXi AT లో ఉండవు. ఉదాహరణకు 360 డిగ్రీ కెమెరా.. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు.. పెద్ద 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ వంటి ఫీచర్ల కోసం టాప్ వేరి అంటే ను పరిశీలించాలి.
ఈ మోడల్ కార్ లో ఉన్న ప్రత్యేకతలో క్యాబిన్ స్పేస్ ఒకటి. వెనుక సీట్లలో కూడా ప్రయాణికులకు తగినంత స్థలం ఉంటుంది. ముగ్గురు పెద్దవాళ్లు కూర్చుని అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్ లోకి వెళ్లే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 328 లీటర్ల బూట్ స్పేస్ ఉండడంతో లగేజ్ పెట్టుకోడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. సేఫ్టీ విషయంలో కూడా పార్కింగ్ సెన్సార్లు.. ఎయిర్ బ్యాగులు.. ఏబిఎస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఇక ఈ కారు మ్యానువల్ కంటే ధర ఎక్కువ.. ప్రీమియర్ ఫీచర్ లేకపోవడం.. పెట్రోల్ ఖర్చు ఉండడం.. పంతీరు స్ఫూర్తిగా ఉండడం.. పెద్ద సన్రూఫ్ లేకపోవడం లోపాలు.