Ramya Krishna: సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో కొనసాగుతున్న వారిలో ఒకరు రమ్యకృష్ణ. 5 పదుల వయస్సు వచ్చినా కూడా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గలేదు. క్రేజీ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. నిన్నగాక మొన్న వచ్చిన హీరోయిన్స్ కూడా ఒకటి రెండు ఫ్లాపులకు కనుమరుగు అవుతున్న ఈరోజుల్లో, దాదాపుగా మూడున్నర దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో టాప్ రేంజ్ లో కొనసాగడమంటే సాధారణమైన విషయం కాదు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నేటి తరం హీరోయిన్స్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు హీరోయిన్స్ కి హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చేవని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఒక సినిమా సక్సెస్ అయితే వరుసగా నాలుగైదు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, రెండు ఫ్లాప్స్ పడితే కనిపించకుండా పోతున్నారని, ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ కనీసం పాతికేళ్ల కెరీర్ ని కూడా కొనసాగించలేకపోతున్నారని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. ఉదాహరణకు శ్రీలీల నే తీసుకోవచ్చు. వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్లిన ఈమెకు ,ఇప్పుడు ఫ్లాప్స్ రావడం తో మేకర్స్ పట్టించుకోవడం లేదు. అలా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కేవలం కొంతమంది మాత్రమే రమ్యకృష్ణ తరహాలో ఫ్లాపులతో సంబంధం లేకుండా కొనసాగుతున్నారు. నయనతార , త్రిష వంటి వారు అందుకు బెస్ట్ ఉదాహరణ. మరి నేటి తరం హీరోయిన్స్ లో అలా ఎవర్ గ్రీన్ స్టార్స్ గా కొనసాగేవారు ఎవరని మీరు అనుకుంటున్నారు ? , మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.