Homeబిజినెస్Car Buying Tips: కారు కొంటున్నప్పుడు 90 శాతం మంది ఇలానే మోసపోతున్నారు.. మీరూ ఈ...

Car Buying Tips: కారు కొంటున్నప్పుడు 90 శాతం మంది ఇలానే మోసపోతున్నారు.. మీరూ ఈ తప్పులు చేయకండి..

Car Buying Tips: నాలుగు చక్రాల వెహికిల్ కొనాలని చాలామందికి ఒక డ్రీమ్. ఎన్నో నెలల డబ్బులు పొదుపు చేసి.. బ్యాంకు లోన్ తీసుకొని.. కుటుంబ సభ్యులతో కలిసి షో రూమ్ కి వెళ్లి నచిన కారును బుక్ చేసుకుంటారు. అయితే కారు కొనుగోలు చేసే సమయంలో చాలామంది కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోరు. ముఖ్యంగా షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పే మాటలను పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు. కారు ధర.. మైలేజ్.. డిస్కౌంట్లు.. ఇన్సూరెన్స్.. […]

Car Buying Tips: నాలుగు చక్రాల వెహికిల్ కొనాలని చాలామందికి ఒక డ్రీమ్. ఎన్నో నెలల డబ్బులు పొదుపు చేసి.. బ్యాంకు లోన్ తీసుకొని.. కుటుంబ సభ్యులతో కలిసి షో రూమ్ కి వెళ్లి నచిన కారును బుక్ చేసుకుంటారు. అయితే కారు కొనుగోలు చేసే సమయంలో చాలామంది కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోరు. ముఖ్యంగా షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పే మాటలను పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు. కారు ధర.. మైలేజ్.. డిస్కౌంట్లు.. ఇన్సూరెన్స్.. యాక్సెసరీస్ వంటి విషయాలలో సరైన అవగాహన లేకపోవడంతో అనవసరంగా వేల రూపాయలు అదనంగా చెల్లిస్తూ ఉంటారు.

నిజానికి కారు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మంచి డీల్ అనుకుని వెళ్లి ఎక్కువ డబ్బులు చెల్లించి పరిస్థితి ఎదురు కావచ్చు. అందువల్లే షోరూం వెళ్లే ముందు ప్రతి ఒక్కరు ఈ విషయాలను తెలుసుకోవాలి.

ఎక్స్ షోరూం ధర చూసి మోసపోవద్దు

చాలామంది ఇంటర్నెట్లో కారు ధర చూసి షో రూమ్ కి వెళ్తుంటారు. అక్కడ కారు దర తక్కువగా కనిపించడంతో వెంటనే బుక్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ వెబ్సైట్లో కనిపించే ధర సాధారణంగా ఎక్స్ షోరూం ధర మాత్రమే. రిజిస్ట్రేషన్.. రోడ్డు టాక్స్.. ఇన్సూరెన్స్.. ఇతర చార్జీలు కూడా కలుస్తాయి. దీంతో కారు ఆన్ రోడ్ ధర పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బుక్ చేసే సమయంలో ఆన్ రోడ్ ధర ఎంత అవుతుందో తెలుసుకోవాలి. ప్రతి చార్జీ వివరాలను విడివిడిగా పరిశీలించాలి.

డీలర్ చెప్పిన ఇన్సూరెన్స్ నే తీసుకోవాల్సిన అవసరం లేదు

కొన్ని షో రూమ్లలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ తన వద్ద అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే కొనుగోలుదారులు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కూడా ధనులు తెలుసుకోవచ్చు. ఒకే రకమైన కవరేజీ ఉన్న పాలసీల ప్రీమియంలను పోల్చి చూడాలి. కేవలం తక్కువ ధర చూసి పాలసీ తీసుకోకుండా.. ఐడివి.. జీరో డిప్రిసియేషన్.. ఇంజన్ ప్రొటెక్షన్.. రోడ్డు సైడ్ అసిస్టెన్స్ వంటి కవరేజీలను పరిశీలించాలి.

అవసరం లేని యాక్సిసరీలు వద్దు

కారు కొనుగోలు చేసి సమయంలో షోరూంలో ఫ్లోర్ మాట్స్.. సీట్ కవర్లు.. మడ్ ప్లాప్స్.. బాడీ కవర్.. క్రోమ్ యాక్సెసరీస్ వంటి వాటిని ప్రత్యేక ప్యాకేజీగా ఇస్తూ ఉంటారు. వీటిని తప్పనిసరిగా కొనాల్సిన అవసరం లేదు. కొన్ని యాక్సిసరీస్ బయట మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తాయి. అయితే ఎలక్ట్రిక్.. వారంటీకి సంబంధించిన అంశాలలో జాగ్రత్త చాలా అవసరం. కంపెనీ అందించిన యాక్ససరీస్ కి ప్రాధాన్యం ఇవ్వాలి.

డిస్కౌంట్ పేరుతో పాత స్టాక్ ఇస్తున్నారా

కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించినప్పుడు చాలామంది వెంటనే బుక్ చేసుకుంటారు. కానీ ఆ డిస్కౌంట్ వెనుక కారణం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాలలో గత యెడల తయారైన కార్లపై డిస్కౌంట్ లు లభించవచ్చు. పాత స్టాకు కొనడం తప్పనిసరిగా నష్టమని కాదు. తయారీ నెల.. సంవత్సరం.. స్టోర్ చేసిన విధానం.. బ్యాటరీ.. టైర్ల పరిస్థితి ఏమిటో వంటి విషయాలను పరిశీలించాలి. కారు తయారీ తేదీని విఐఎన్ లేదా చాసిస్ నెంబర్ ద్వారా ధృవీకరించుకోవాలి. డిస్కౌంట్ కోసం కొత్తగా వచ్చిన మోడల్ ధరతో పోల్చకుండా పాత స్టాక్ ను ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయకూడదు.

టెస్ట్ డ్రైవ్ చేయకుండా కార్ బుక్ చేయవద్దు

కారు ఫోటోలు.. వీడియోలు చూసి నచ్చిందని వెంటనే బుక్ చేసుకోవడం మంచిది కాదు. ప్రతి కారు డ్రైవింగ్ అనుభవం భిన్నంగా ఉంటుంది. అందుకే టెస్ట్ డ్రైవ్ తప్పనిసరిగా చేయాలి. డ్రైవర్ సీట్ సౌకర్యం.. బ్రేకింగ్.. స్టీరింగ్.. సస్పెన్షన్.. గేర్ బాక్స్.. ఏసీ పనితీరు వంటి అంశాలను పరిశీలించాలి. వీలుంటే కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకెళ్లాలి.

మైలేజ్ విషయంలో

కారు కొనుగోలు చేసే వారిలో చాలామంది మైలేజ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. షో రూమ్ లో లీటర్తో 20 లేదా 25 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని చెప్పేటప్పుడు ఆకర్షితులవుతారు. కంపెనీ ప్రకటించే ఏఆర్ఏఐ మైలేజ్ అనేది నిర్దిష్ట పరీక్ష పరిస్థితుల్లో లభించిన ఫలితం. వాస్తవ రోడ్లపై ట్రాఫిక్.. డ్రైవింగ్ విధానం.. ఏసీ ఉపయోగించే తీరు.. రోడ్ల పరిస్థితి ఆధారంగా మైలేజ్ మారుతూ ఉంటుంది. కాబట్టి అదే మోడల్ కారు వాడుతున్న యజమానుల నుంచి రియల్ వరల్డ్ మైలేజ్ వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

లోన్ తీసుకున్నప్పుడు

కారు కొనుగోలు చేసే వారిలో చాలామంది బ్యాంకు లోన్ తీసుకుంటారు. ఈ సమయంలో నెల వారి ఈఎంఐ ఎంత వస్తుంది అనే విషయం మీద దృష్టి పెడతారు. కానీ వడ్డీ రేట్లు.. లోన్ ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ కాల పరిమితి.. ముందస్తు చెల్లింపుల నిబంధనలు కూడా కష్టంగా తెలుసుకోవాలి. ఈఎంఐ తక్కువగా కనిపించడానికి ఎక్కువగా సంవత్సరాల కాల పరిమితితో రుణం తీసుకుంటే చివరికి వడ్డీ రూపంలో ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు. అందుకే కనీసం రెండు మూడు బ్యాంకుల లోన్ ఆఫర్లను పోల్చి చూడాలి.

ఇన్వాయిస్ ముందు కారు తనిఖీ చేయాలి

కారు డెలివరీ తీసుకునే ముందు ఫ్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేయడం చాలా ముఖ్యం. కారులో గీతలు డెంట్లు.. పెయింట్ తేడాలు.. టైర్ల పరిస్థితి.. ఒడోమీటర్ రీడింగ్.. లైట్లు.. ఎలక్ట్రానిక్ ఫీచర్లు.. బ్యాటరీ వంటి అంశాలను పరిశీలించాలి. వీలైతే కారు కొనుగోలలో అనుభవం ఉన్న వ్యక్తిని వెంట తీసుకెళ్లాలి. కారును పరిశీలించకుండా డెలివరీ తీసుకోవడానికి తొందరపడకూడదు.

వారంటీ పేరుతో

కొన్ని కార్లకు ఎక్స్టెండెడ్ వారంటీ.. పెయింట్ ప్రొటెక్షన్.. యాంటీ రెస్ట్ కోటింగ్ వంటి అదనపు ప్యాకేజీలను ఇస్తూ ఉంటారు. అవన్నీ అవసరమా కాదా అనేది ముందుగా తెలుసుకోవాలి. కంపెనీ స్టాండర్డ్ వారంటీ ఎంత కాలం ఉంటుంది.. అదనపు వారంటీ తీసుకుంటే ఏ భాగాలకు వర్తిస్తుంది.. ఏవి మినహాయింపు.. అనే వివరాలు తెలుసుకోవాలి. నిబంధనలు తెలుసుకోకుండా అదనపు ప్యాకేజీలకు డబ్బులు ఇవ్వకూడదు.

బుకింగ్ చేసే ముందు

చివరగా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే.. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాటలపై నమ్మకంతో బుకింగ్ చేస్తారు. కాని తర్వాత చెప్పిన డిస్కౌంట్.. ఉచిత యాక్సెసరీస్.. డెలివరీ తేదీ వంటి వాటి విషయాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు.

అందుకే కార్ బుకింగ్ సమయంలో వేరియంట్.. కలర్.. మొత్తం ధర.. డిస్కౌంట్.. బుకింగ్ ఎమౌంట్.. క్యాన్సల్ కండిషన్స్.. డెలివరీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper