Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ గేమ్ మొత్తం రోహిత్ చుట్టూనే తిరుగుతోంది. అతను హౌస్ లో ఉన్నా , లేకపోయినా సోషల్ మీడియా లో బజ్ మొత్తం రోహిత్ పైనే ఉంది. ఇంతటి క్రేజ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవ్వరూ లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి ‘అగ్ని పరీక్ష 2’ లో మన అందరం చూసిన రోహిత్ ‘బిగ్ బాస్ 10’ లో కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఆడిన టాస్కులు చాలా తక్కువ, కంటెస్టెంట్స్ ప్రతీసారి అతనికి అవకాశం రానివ్వకుండా తొక్కేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఈ రేంజ్ క్రేజ్ ఉందంటే, ఇక ‘అగ్ని పరీక్ష 2’ లో ఇచ్చిన పెర్ఫార్మన్స్ ‘బిగ్ బాస్ 10’ లో ఇచ్చి ఉండుంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో మీరే ఊహించుకోండి. రోహిత్ క్రేజ్ గురించి, అతని ఓటింగ్ గ్రాఫ్ గురించి హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరికీ బాగా తెలుసు.
ముఖ్యంగా రామ్ ప్రసాద్ కి ఇలాంటివి అంచనా వేయడం కొట్టినపిండి లాంటిది. అలాంటి రామ్ ప్రసాద్ ఒక రోజు దేబ్జానీ తో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరెవరు ఉంటారో చర్చిస్తూ కొందరి పేర్లు చెప్తాడు. ఆ పేర్లలో రోహిత్ పేరు లేకపోవడం అందరినీ షాక్ కి గురి చేసిన అంశం. అప్పట్లో రోహిత్ ఫ్యాన్స్ ఈ వీడియో ని పోస్ట్ చేస్తూ, రామ్ ప్రసాద్ కి బయట రోహిత్ క్రేజ్ గురించి తెలిస్తే ఏమైపోతాడో అంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు రామ్ ప్రసాద్ చెప్పిందే నిజమైంది. టైటిల్ విన్నర్ అవుతాడని అనుకున్న రోహిత్, కేవలం 8 వారాల్లోనే ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా కంటెస్టెంట్స్ ఓట్ల ద్వారా. ఆ ఓటు వేసిన వారిలో రామ్ ప్రసాద్ కూడా ఉన్నాడు. అయితే రోహిత్ క్రేజ్ గురించి ఒక ఐడియా ఉన్నటువంటి రామ్ ప్రసాద్, అతను టాప్ 5 లో ఉండదు అని అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగాడు అనే అనుమానం ఇప్పుడు ప్రేక్షకుల్లో కలిగింది.
పైగా టాప్ 5 లో నీలాంటి తోపు కంటెస్టెంట్ ఉండాలి , అప్పుడే గేమ్ లో మజా వస్తుంది అని రామ్ ప్రసాద్ ఒకరోజు రోహిత్ తో అంటాడు. అలా అన్న ఆయన చివరికి రోహిత్ ఎలిమినేట్ అయ్యేందుకు ఓటు వేయడం ప్రేక్షకుల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. బిగ్ బాస్ టీం రోహిత్ ని షో మధ్యలోనే ఎదో ఒక ప్రక్రియ ద్వారా ఎలిమినేట్ చేస్తామని రామ్ ప్రసాద్ తో చెప్పారా ?, ఎందుకంటే గత సీజన్ లో ‘అగ్ని పరీక్ష’ నుండి హౌస్ లోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో రోహిత్ కి కూడా అలాంటి క్రేజ్ వచ్చింది. ఈసారి కూడా టైటిల్ విన్నర్ సామాన్యుడికే వెళ్లే అవకాశాలు కనిపించడం తో సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపలేదని, ఆ సమయంలో ప్రతీ ఒక్కరికి ఈ సీజన్ టైటిల్ విన్నర్ ని సెలబ్రిటీలలో ఒకరిని చేస్తామని చెప్పి ఉండొచ్చని, రామ్ ప్రసాద్ కి ఆ సమాచారం ఉండడం వల్లే, రోహిత్ టాప్ 5 లో ఉండడు అని చెప్పి ఉండొచ్చని నెటిజెన్స్ అనుమానిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.