Homeఎంటర్టైన్మెంట్Akkineni Nagarjuna: ప్రేమతో ఇంటికి వచ్చిన నాగార్జున ని బలవంతంగా బయటకు పంపేసిన ప్రముఖ...

Akkineni Nagarjuna: ప్రేమతో ఇంటికి వచ్చిన నాగార్జున ని బలవంతంగా బయటకు పంపేసిన ప్రముఖ నటి..చివరికి ఏమైందంటే!

Akkineni Nagarjuna: టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ లో ఆయనకు ఉండే గౌరవం వేరు. సాధారణంగా ఆయన ప్రైవేట్ ఫంక్షన్స్ లో కనిపించడం చాలా కష్టం. తనకు అత్యంత సన్నహితంగా ఉండే సినీ సెలబ్రిటీల కుటుంబాలకు సంబంధించిన ప్రైవేట్ ఫంక్షన్స్ లోనే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి నాగార్జున ఒక సాధారణమైన క్యారెక్టర్ ఆర్టిస్టు కూతురి మెచూరిటీ ఫంక్షన్ కి పిలవగానే వెళ్తే, ఆ […]

Akkineni Nagarjuna: టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ లో ఆయనకు ఉండే గౌరవం వేరు. సాధారణంగా ఆయన ప్రైవేట్ ఫంక్షన్స్ లో కనిపించడం చాలా కష్టం. తనకు అత్యంత సన్నహితంగా ఉండే సినీ సెలబ్రిటీల కుటుంబాలకు సంబంధించిన ప్రైవేట్ ఫంక్షన్స్ లోనే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి నాగార్జున ఒక సాధారణమైన క్యారెక్టర్ ఆర్టిస్టు కూతురి మెచూరిటీ ఫంక్షన్ కి పిలవగానే వెళ్తే, ఆ నటి దయచేసి వెళ్లిపోండి అంటూ వెనక్కి పంపేసిందట. ఆ నటి మరెవరో కాదు , హేమ. ఎన్నో వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన హేమ, నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నది. అంతే కాకుండా నాగార్జున హీరోగా నటించిన అనేక సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. అలా ఆమెతో ఉన్నటువంటి పరిచయం కారణంగా నాగార్జున పిలవగానే ఆ ఫంక్షన్ కి వెళ్లారు.

అయితే ఆరోజు జరిగిన సంఘటన గురించి హేమ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వివరిస్తూ నా కూతురి మెచూరిటీ ఫంక్షన్ కి నాగార్జున గారు అమలతో కలిసి వచ్చారని, గంటన్నరసేపు ఆ ఫంక్షన్ లో ఆయన ఉన్నారని, ఇంకా కాసేపు ఉండాలని అనుకున్నారని , కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు నాగార్జున గారిని ఫోటోల కోసం ఇబ్బంది పెడుతుండడం చేసి, ఇక వెళ్లిపోండి అంటూ నాగార్జున గారిని బ్రతిమిలాడి పంపేసానంటూ చెప్పుకొచ్చింది. అంత పెద్ద స్టార్ కి ఇలా చెప్పడమంటే చిన్న విషయం కాదు. నాగార్జున ఇబ్బంది పడడం చూసి అలా చెప్పడంలో తప్పు లేదు, కానీ స్వయంగా ఆయన ఆ ఫంక్షన్ లో ఇంకా కాసేపు ఉండాలని అనుకున్నప్పుడు మాత్రం ఇలా చెప్పడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కాబట్టి చాలా కూల్ గా డీల్ గా చేశారు కానీ , వేరే సెలబ్రిటీ అయితే పెద్ద రచ్చ చేసేవారని నెటిజెన్స్ అంటున్నారు.

ఇక హేమ విషయానికి వస్తే ఈమె సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు దాదాపుగా ప్రతీ సినిమాలో కనిపించేది. కానీ పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యాక ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. పైగా రీసెంట్ గా బెంగళూరు లో జరిగిన ఒక రేవ్ పార్టీ లో హేమ అరెస్ట్ కి గురి కావడం పెద్ద సంచలనం గా మారింది. అయితే కోర్టు ఆమెని నిర్దోషిగా భావించి వదిలేయడంతో ఆమె పరువు పోలేదు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆ ఘటన గురించి మాట్లాడుతూ నా జీవితం లో అనుభవించని కష్టాలు, ఇబ్బందులు మొత్తం 2024 లోనే అనుభవించానని, ఏ తప్పు చేయకపోయినా కష్టాలపాలయ్యానని, ఆ సమయం లో చనిపోవాలని అనుకున్నాను అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper