Homeఎంటర్టైన్మెంట్Degala Babu: యాంకర్‌ని పెళ్లాడిన జబర్దస్త్ కమెడియన్..వైరల్ ఫొటోలు..ఎవరెవరు వచ్చారో తెలుసా?

Degala Babu: యాంకర్‌ని పెళ్లాడిన జబర్దస్త్ కమెడియన్..వైరల్ ఫొటోలు..ఎవరెవరు వచ్చారో తెలుసా?

Degala Babu: జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన కమెడియన్స్ లో ఒకరు డేగల బాబు. ఎన్నో వందల స్కిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబు లో ఒక గొప్ప దర్శకుడు కూడా ఉన్నాడని రీసెంట్ గా ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‘ అనే వెబ్ సిరీస్ తో రుజువైంది. నెట్ ఫ్లిక్స్, ఈవ్ విన్ యాప్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే […]

Degala Babu: జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన కమెడియన్స్ లో ఒకరు డేగల బాబు. ఎన్నో వందల స్కిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబు లో ఒక గొప్ప దర్శకుడు కూడా ఉన్నాడని రీసెంట్ గా ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‘ అనే వెబ్ సిరీస్ తో రుజువైంది. నెట్ ఫ్లిక్స్, ఈవ్ విన్ యాప్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ స్థాయిలో ఆ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని బాబు కలలో కూడా ఊహించి ఉండదు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఆయన రాసిన స్కిట్స్ కి కూడా ఇంత రీచ్ రాలేదని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ వెబ్ సిరీస్ హిట్ తో ఆయనకు టాలీవుడ్ లో ఇప్పుడు అవకాశాలు క్యూలు కడుతున్నాయి.

ఇదంతా పక్కన పెడితే బాబు చాలా కాలం నుండి అమూల్య అనే అమ్మాయితో లవ్ రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దీపావళి పండుగ సమయంలో వీళ్లిద్దరి ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. అయితే నిన్న వీళ్లిద్దరి పెళ్లి హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు బాబు సోషల్ మీడియా లో షేర్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. ఈ వివాహ వేడుకకు సింగర్ సునీత, టేస్టీ తేజ, సందీప్ మాస్టర్ , పంచ్ ప్రసాద్, నూకరాజు , వైవా హర్ష , హైపర్ ఆది తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పెళ్ళిలో సందడి చేశారు. జీవితం లో పెద్ద సక్సెస్ అందుకున్న తర్వాత బాబు ఇలా ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం శుభ పరిణామం. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా లో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper