Actor Shivaji: హీరో గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న శివాజీ, ‘బిగ్ బాస్’ తర్వాత తన ఇమేజ్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆయన అన్ని భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఈమధ్య కాలం లో ఆయన పలు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి దాదాపుగా 6 నెలల పాటు సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యాడు. కానీ ఆ కామెంట్స్ శివాజీ కి ఫైనల్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ ఇమేజ్ ని ఆయన సినిమా అవకాశాల కోసం పర్ఫెక్ట్ గా వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే శివాజీ కొన్నేళ్లు సినిమాలకు దూరమై రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం లో కూడా రాణించాడు.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు బాగా వైరల్ అయ్యాయి. సినిమాలకు దూరమైన రోజుల్లో జీవనాధారం కోసం కొన్ని స్థలాలను కొని అమ్మడం వంటివి చేసేవాడినని, అలా యాదిగిరిగుట్టలో 9 లక్షలకు కొన్ని ఎకరాలను కొనుగోలు చేసానని, ఆ తర్వాత అమ్మేశానని, ఇప్పుడు దాని విలువ 1800 కోట్ల రూపాయలకు చేరిందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ శివాజీ ఆ ల్యాండ్ ని అమ్మకపోయి ఉండుంటే నేడు దేశంలోనే అపార కుబేరుల్లో ఒకరిగా ఉండేవాడు. టాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరోలందరికంటే ఎక్కువ ఆస్తిగల సెలబ్రిటీగా అరుదైన రికార్డు ని నెలకొల్పేవాడు. దురదృష్టం అంటే బహుశా ఇలాగే ఉంటుందేమో.మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పోగొట్టుకున్న ఈ డబ్బులను , సినీ రంగం ద్వారా శివాజీ సంపాదించగలరా?, లేదా మళ్లీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం లో భాగం అవుతాడా అనేది చూడాలి.