spot_img
HomeతెలంగాణTelangana Congress: కాంగ్రెస్‌కు కలిసొచ్చింది... హస్తంలో కొత్త జోష్‌!

Telangana Congress: కాంగ్రెస్‌కు కలిసొచ్చింది… హస్తంలో కొత్త జోష్‌!

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. రెండో ఏడాది పాలనపై ప్రజలు అనేక అంచనాలు పెట్టుకున్నారు. ఆమేరకు పాలన అందించలేకపోయినా.. పార్టీకి ఈ ఏడాది కూడా బాగా కలిసి వచ్చింది. 2025లో ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకం ప్రారంభించారు. ఇక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. దీంతో పార్టీపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు అన్న భావన హస్తం నేతల్లో నెలకొంది.

వాగ్దానాల అమలు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం 2025 ప్రారంభంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. మొదట స్థలం ఉండి ఇల్లు లేనివారిని ఎంపిక చేశారు. నియోజకవర్గానికి 3500 చొప్పున 119 నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. దీంతో లబ్ధిదారుల్లో సంతోషం కనిపిస్తోంది. ఇదే ఏడాది కొత్త రేషన్‌కార్డుల జారీ మొదలు పెట్టారు. 2024లో దరఖాస్తులు స్వీకరించినా.. జారీ మాత్రం ఈ ఏడాది మొదలైంది. అర్హులందరికీ కార్డులు జారీ అయ్యాయి. దీంతో రేవంత్‌ సర్కార్‌పై సానుకూలత నెలకొంది. అయితే సన్నవడ్ల బోనస్‌ యాసంగిలో ఇవ్వలేదు. ఇక మహిళలకు రూ.2,500 నగదు, పింఛన్ల పెంపు హామీ నెరవేరలేదు.

మహిళలకు ఇందిర మహిళా శక్తి..
ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు చేశారు. మహిళా సంఘాలకు క్యాంటీన్లు, బస్సులు, పెట్రోల్‌ బంకులు, సోలార్‌ యూనిట్లు ఇచ్చారు. మహిళల ఆర్థిక శక్తి పెంపే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో మహిళా సంఘాల్లో రూ.2,500 ఆర్థికసాయం అందలేదన్న ఆలోచన కలుగడం లేదు. ఇక ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ పథకాలు అమలవుతున్నాయి.

ఎన్నికల్లో విజయం..
2025లో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ స్థానం అయిన జూబ్లీహిల్స్‌లో హస్తం పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమష్టిగా పనిచేసి విజయం సాధించారు. ఇక డిసెంబర్‌లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్‌ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది.
బీసీ రిజర్వేషన్లకు విఫల యత్నం
స్థానిక సంస్థల్లో బీజీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదం తెలుపలేదు. దీంతో చట్టరూపం దాల్చలేదు. అయినా రేవంత్‌ సర్కార్‌ జీవో ద్వారా రిజర్వేషన్ల అమలుపై జీవో ఇచ్చింది. అయితే దీనిని కోర్టులు కొట్టేశాయి. దీంతో రేవంత్‌ సర్కార్‌ ప్రయత్నించింది అన్న భావన బీసీల్లో నెలకొంది. దీంతో పంచాయతీ ఎన్నికలోల సానుకూల ఫలితాలు వచ్చాయి.

ఎమ్మెల్యేల అనర్హతపై కీలక నిర్ణయం..
ఇక బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో గడ్డం ప్రసాద్‌కుమార్‌ విచారణ పూర్తి చేశారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వివరణ తీసుకున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ మినహా 8 మంది వివరణ ఇచ్చారు. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్‌ బీఆర్‌ఎస్‌ ఫిర్యాదులను కొట్టేశారు. మరో ముగ్గురి విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

మొత్తంగా 2025 హస్తం పార్టీకి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎన్నికల్లో విజయాలు. పథకాల అమలులో జాప్యం జరిగినా వ్యతిరేకత లేకపోవడం, పాలన సాఫీగా సాగిపోవడంతో రేవంత్‌రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper