Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: స్థానిక ఎన్నికల్లో జనసేనను నమ్ముకున్న జగన్..

YS Jagan: స్థానిక ఎన్నికల్లో జనసేనను నమ్ముకున్న జగన్..

YS Jagan: వైసిపికి క్షేత్రస్థాయిలో బలం తగ్గిపోయిందా.. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయిందా.. ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు.. పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులు ఎందుకు విమర్శలు చేస్తున్నారు.. ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిలో ఆలోచనకు కారణమయ్యాయా.. అందువల్లే ఆయన ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కీలక నాయకులతో సమావేశాలు నిర్వహించారా.. వీటికి అవును అని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక్కడితోనే వైసీపీ పరిస్థితి ఆగిపోవడం […]

YS Jagan: వైసిపికి క్షేత్రస్థాయిలో బలం తగ్గిపోయిందా.. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయిందా.. ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు.. పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులు ఎందుకు విమర్శలు చేస్తున్నారు.. ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిలో ఆలోచనకు కారణమయ్యాయా.. అందువల్లే ఆయన ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కీలక నాయకులతో సమావేశాలు నిర్వహించారా.. వీటికి అవును అని చెబుతున్నారు విశ్లేషకులు.

ఇక్కడితోనే వైసీపీ పరిస్థితి ఆగిపోవడం లేదు. వైసిపి ముసుగులో ఉన్న కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో ఫేక్ హ్యాండిల్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే ఆరోపణలను జనసేన నాయకులు చేస్తున్నారు. జనసేన ముసుగులో కొద్దిరోజులపాటు పవన్ కళ్యాణ్ కు వీర విధేయులుగా నటిస్తున్న వైసీపీ నాయకులు.. ఆ తర్వాత కూటమిలో అంతర్గత సంక్షోభం కొనసాగుతోందని.. కూటమి విచ్ఛిన్నమవుతుందని.. స్థానిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్ల సర్దుబాటు జరగకపోతే నష్టం దారుణంగా ఉంటుందని సోషల్ మీడియా గ్రూపులలో కామెంట్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుస్తోందని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.

కూటమిలో జన సేనను విచ్చిన్నం చేసి.. ఆ ఓటు బ్యాంకు ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసిపి ప్రయత్నాలు చేస్తోందని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమిలో జనసేనకు అన్యాయం జరుగుతోందని.. పవన్ కళ్యాణ్ కార్యకర్తల గురించి పట్టించుకోవడంలేదని.. సీట్ల సర్దుబాటు కూడా సక్రమంగా సాగడం లేదని.. టిడిపి భిక్షం వేస్తే తీసుకోవలసిన దుస్థితి జనసేనకు ఉందని.. ఇలా రకరకాలుగా వైసిపి ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు అంటున్నారు.. గతంలో వందలకే పరిమితమైన ఇటువంటి గ్రూపులు.. ఇప్పుడు వేలకు చేరిపోయాయని.. విష ప్రచారం చేసి కూటమిని విచ్చిన్నం చేయాలని వైసిపి ప్రయత్నిస్తోందని జనసేన నాయకులు అంటున్నారు.

తమ గురించి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారని.. స్థానిక ఎన్నికల్లో సముచిత ప్రాధాన్యం లభించే విధంగా చూస్తారని.. ఇప్పటికే జనసేన కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారని.. అలాంటప్పుడు వైసీపీ చేసే ఫేక్ ప్రచారం ముసుగులో తాము పడేది లేదని జనసేన నాయకులు అంటున్నారు. “జనసేనకు క్షేత్రస్థాయిలో బలం లేదని అంటున్నారు. జనసేనకు బలమైన కార్యవర్గం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు జనసేన ఓటు బ్యాంకు మీద జగన్ ఎలా ఆధారపడతారు.. జగన్ జనసేన ను కూటమి నుంచి బయటికి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనిని బట్టి జనసేన బలమేమిటో అర్థం చేసుకోవచ్చని” జనసేన కార్యకర్తలు అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంకు మీద ఆధారపడాలని జగన్ చూస్తున్నారని.. కానీ ఆయన పాచికలు పారవని జనసేన కార్యకర్తలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper