Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: సంచలన సర్వే.. ఏపీలో గెలుపు కోసం జగన్ పెద్ద ప్లాన్

YS Jagan Mohan Reddy: సంచలన సర్వే.. ఏపీలో గెలుపు కోసం జగన్ పెద్ద ప్లాన్

YS Jagan Mohan Reddy: ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అక్కడ ప్రతిరోజు వాతావరణం ఎన్నికల మాదిరిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 లో జరిగిన ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్న వైసిపికి దిమ్మతిరిగే ఫలితం వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలు గెలుచుకున్న వైసిపి.. 2024 లో 11 స్థానాలకు పడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసిపికి దక్కలేదు. భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ.. గొప్పగా […]

YS Jagan Mohan Reddy: ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అక్కడ ప్రతిరోజు వాతావరణం ఎన్నికల మాదిరిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 లో జరిగిన ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్న వైసిపికి దిమ్మతిరిగే ఫలితం వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలు గెలుచుకున్న వైసిపి.. 2024 లో 11 స్థానాలకు పడిపోయింది.

కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసిపికి దక్కలేదు. భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ.. గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకున్నప్పటికీ.. సొంత మీడియాలో డబ్బాలు కొట్టుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీనికి తోడు అవినీతి అక్రమాలు.. కుంభకోణాలు తెర మీదకి రావడంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర నిర్వహించాలని అనుకున్నారు. త్వరలోనే పాదయాత్ర మొదలు పెడతామని ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.

పార్టీలో అంతర్గత వర్గాలు.. కీలక నాయకులు ఇటీవల సర్వే నిర్వహించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ సర్వేలో వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. పైగా క్షేత్రస్థాయిలో కూటమి బలోపేతంగా ఉండడంతో పాదయాత్ర నిర్వహిస్తే పెద్దగా ఫలితం ఉండదని తెలిసింది. అందువల్లే జగన్ తన పాదయాత్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2017లో జగన్ పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో ఫలితాలను తన అనుకూలంగా మార్చుకున్నారు. ఈసారి కూడా అదే చేద్దామని అనుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో.. సంక్షేమం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించింది. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోంది. దీంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం మారింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేస్తే పెద్దగా ఉపయోగ ఉంటుందని జగన్ కు అంతర్గత వర్గాలు సూచించడంతో పాదయాత్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఒక ఏడాది పాదయాత్ర నిర్వహించడానికి ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటారని.. అప్పటిదాకా పార్టీ బలోపేతంపై దృష్టి పెడతారని నాయకులు అంటున్నారు.ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తే టిడిపి నుంచి లోకేష్ కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి లోకేష్ కూడా ఒకటి రెండు సమావేశాలలో క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ జగన్ గనుక పాదయాత్రకు దిగితే.. కచ్చితంగా లోకేష్ పాదయాత్ర చేసే అవకాశం ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇద్దరు నేతలు పోటాపోటీగా పాదయాత్ర చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు మారే అవకాశం ఉంది. యువ గళం పాదయాత్ర ద్వారా ఏపీలో కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన లోకేష్.. జగన్ పాదయాత్ర చేస్తే.. దానికి కౌంటర్గా యాత్ర చేసి.. మరోసారి టిడిపిని అధికారంలోకి తీసుకొస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper