Revanth Reddy konda Surekha: మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ సైలెంట్ గా ఏం లేదు. తన లాబింగ్ చేస్తూనే ఉంది. అలా చేయకపోతేనే ఆశ్చర్యం. పైగా కాంగ్రెస్ పార్టీ.. అందులో ఒక్కొక్కరు ఒక్కోశక్తి. పార్టీ నాశనమైన పర్వాలేదు.. తమ సేఫ్ గా ఉంటే చాలు అనే క్యారెక్టర్లే ఎక్కువ. అలాంటప్పుడు ఇలా జరగకుంటే.. ఇంకెలా జరుగుతుంది..
మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత
సురేఖని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులు మాత్రమే వాతావరణం సానుకూలంగా ఉంది. ఆ తర్వాత మళ్లీ మొదలైంది.. ఈసారి ఏకంగా కొండా సురేఖ భర్త మురళి తెరమీదకి వచ్చాడు. తను ఏదో చెప్పుకుంటూ పోయాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాడట. ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మళ్లీ గెలువు సారూ.. రాహుల్ గాంధీని తర్వాత ప్రధానమంత్రిని చేద్దువు గాని..
అసలు టార్గెట్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డినే
కొండ మురళి దగ్గర ముగ్గురు ముస్లిం డ్రైవర్లు పని చేస్తారట. పైగా ఆయన దగ్గర రేర్ మోడల్ కారు ఉందట. కూతురితో వాళ్లకు సంబంధం లేదట.. సంబంధం లేదనుకున్నప్పుడు అప్పట్లో సుమంత్ వ్యవహారం లో సుస్మిత మాట్లాడినప్పుడు సురేఖ ఎందుకు సారీ చెప్పినట్టు.. కాంగ్రెస్ పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేని సుస్మిత మంత్రి కుమార్తె హోదాలోనే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసింది.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇంకా మిగతా మంత్రుల మీద అడ్డగోలుగా మాట్లాడింది.. ఇవే మాటలు బయటి వాళ్లు మాట్లాడితే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ.. సురేఖ కుమార్తె హోదాలోనే ఆమె మాట్లాడింది. కొండ మురళి ఈ విషయాన్ని డైవర్ట్ చేయవచ్చు గాని.. అసలు టార్గెట్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డినే.
ఉన్నన్ని రోజులు గెట్టు పంచాయతీలు
ఆల్రెడీ సుమంత్ ఓఎస్డిగా ఉన్నప్పుడు చేసిన యవ్వారాలను తవ్వుతోంది ప్రభుత్వం.. మరి కొద్ది రోజుల్లో అసలు నిజాలు బయటపడడం ఖాయం. పైగా మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించి.. ఇప్పుడేమో ప్రభుత్వంలో ఎవరూ బాగోలేరు.. కెసిఆర్ మంచోడు.. ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటారు.. ఎందుకు ఉంటారు.. ఈ విషయం గురించి కొండ మురళి ఆలోచించాడా.. లేదా తన భార్య మాటలతో తన సంబంధం లేదని మళ్ళీ చెప్తాడా.. ఒకసారి కాంగ్రెస్.. మరోసారి వైసిపి.. ఆ తర్వాత గులాబీ పార్టీ.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడే.. కేవలం పదవుల కోసం.. ఇతర వ్యవహారాల కోసం వీర విధేయ తెలంగాణ వ్యతిరేకి జగన్ కు జై కొట్టిన చరిత్ర కొండ మురళి దంపతులది.. జగన్ తో చెడిపోయిన తర్వాత మళ్లీ గులాబీ పార్టీ కండువ కప్పుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాయకులు లేనట్టు.. తెలంగాణ వాదులు లేనట్టు కేసీఆర్ వీళ్లకు కండువా కాపాడు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు.. సురేఖ ఎమ్మెల్యేని చేశాడు. అక్కడ ఏమైనా కుదురుగా ఉన్నారా అంటే.. అక్కడ కూడా ఇదే పంచాయతీలు.. ఎర్రబెల్లి దయాకర్ రావు.. కడియం శ్రీహరి.. ఉన్నన్ని రోజులు గెట్టు పంచాయతీలు..
జాలిపడటం తప్ప చేసేది ఏమీ లేదు
ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖను బుజ్జగించడం ఏంటి.. క్యాబినెట్ హోదా ర్యాంకు పోస్ట్ ఇస్తామని చెప్పడమేంటి.. అంటే రేవంత్ రెడ్డి పంతం కేవలం అధిష్టానం ముందు వారం రోజులేనా.. రేపట్నాడు ఇలాంటి సంఘటనలు జరిగితే.. అధిష్టానం ముందు పలుకుబడి ఉన్న నాయకులు మళ్లీ పదవులు తెచ్చుకుంటే.. రేవంత్ రెడ్డి పరపతి ఏమవుతుంది.. సీఎం కు ఉన్న స్థాయి ఏమవుతుంది.. అసలే అంతంతమాత్రంగానే దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. పైగా తెలంగాణ మాత్రమే ఇప్పుడు ఆ పార్టీకి ఒకరకంగా ఆర్థికంగా సపోర్ట్ ఇస్తోంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రిని బలహీనపరిచే కుట్ర చేస్తే అది రాహుల్ గాంధీకి అంతిమంగా నష్టం. ఇలాంటి రాజకీయాలు చేసి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఎలా అవుతారు.. చివరికి కెసిఆర్ కోరుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు చూస్తే.. నవ్వు రావడం కాదు.. ఇంకా చాలా వస్తుంది.. 2014 .. 2018 ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా లేపాడు.. ఎలా భుజాలకు ఎత్తుకున్నాడు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి ని డౌన్ చేస్తే ఆటోమేటిక్గా బలపడొచ్చు.. కాంగ్రెస్ పార్టీని తొక్కొచ్చు.. ఇదే గులాబీ బాస్ కెసిఆర్ స్ట్రాటజీ.. అచ్చం దాన్ని అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. బహుశా ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇంత దిక్కుమాలినతనంతో ఆలోచించదు. పాపం కాంగ్రెస్ పార్టీ.. జాలిపడటం తప్ప చేసేది ఏమీ లేదు.