Chandra Shekar Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి పై పోలీస్ కేసు నమోదు అవ్వడం ఇప్పుడు పెద్ద సంచలనం గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నానక్ రామ్ గూడలోని కాస్మోస్ భావన ప్రాంగణానికి సంబంధించిన భూ వివాదం నేపథ్యం లో ఆయనపై ఈ ఫిర్యాదు నమోదైంది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ని బెదిరించడం తో పాటు , గేటు తాళాలు బద్దలు కొట్టి , అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను ద్వంసం చేసినందుకు గానూ ఈ కేసు ని ఫిర్యాదు చేశారట బాధితులు. ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు , ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు లో ఇంకా ఎన్ని ఆధారాలు బయటపడుతాయి చూడాలి. ఈమధ్య కాలం లో సినీ ఇండస్ట్రీ లో వరుసగా పోలీస్ కేసులు నమోదు అవుతున్న ఈ నేపథ్యం లో అల్లు అర్జున్ మామ పై కేసు నమోదు అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
చంద్ర శేఖర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయం లో ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడినప్పుడు , చంద్ర శేఖర్ పోషించిన మధ్యవర్తిత్వం బాగా వర్కౌట్ అయ్యింది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి , అల్లు అర్జున్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే ఇప్పుడు స్వయంగా చంద్ర శేఖర్ చిక్కుల్లో పడడం తో , ఆయన్ని ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా?, లేదా అనేది చూడాలి. ఈ అంశం లో న్యాయం ఎటు వైపు ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఈ అంశంపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవుతోంది. అల్లు అర్జున్ పై సాధారణంగానే మొదటి నుండి సోషల్ మీడియా లో నెగెటివిటీ విపరీతంగా ఉంటుంది, అలాంటిది ఇలాంటి సమయం లో ఈ వార్త రావడం తో ట్రోల్స్ విపరీతమయ్యాయి. మరి ఈ అంశం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.