Homeప్రవాస భారతీయులుIndians Citizenship: ఇక్కడి నుంచి పోతుండ్రు... అక్కడ వెళ్లగొడుతుండ్ర!

Indians Citizenship: ఇక్కడి నుంచి పోతుండ్రు… అక్కడ వెళ్లగొడుతుండ్ర!

Indians Citizenship: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. చదువులు పూర్తికాగానే అక్కడే ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. జాబ్‌ సెక్యూరిటీ ఉందన్న భరోసా దొరకగానే.. భారత్‌ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇండియాకు వచ్చి పెట్టెబేడ సర్దుకుని కుటుంబాలతో కలిసి ఫారిన్‌ చెక్కేస్తున్నారు. అంతేకాదు కొన్ని రోజులకు భారత పౌరసత్వాన్నే వదులుకుంటున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్లిపుతున్నవారిని విదేశాల్లో మెడలు పట్టి గెండేస్తున్నరు.. వలసల కారణంగా అక్కడి వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని వలసలదారులను వెళ్లగొడుతున్నారు.

భారత పౌరసత్వం వదులుకుంటన్నారు..
ఏటా సుమారు 2 లక్షల మంది భారతీయులు స్వంత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2024లో ఇది 1.7 లక్షలకు పైగా ఉండగా, 2025లో మరింత పెరిగిందని అధికారిక డేటా సూచిస్తోంది. అమెరికా (సుమారు 1.4 లక్షలు), కెనడా, ఆస్ట్రేలియా, యూకేలో స్ధిరపడుతున్నారు. అక్కడి పౌరసత్వాలు స్వీకరిస్తున్నారు. మన దేశంలో ఉన్నత విద్య, ఉద్యోగాల కొరత వల్లే. ఐఐటీ, ఐఐఎం నుంచి టాప్‌ టాలెంట్‌ విదేశాలకు వెళ్తోంది. అక్కడ హెచ్‌–1బీ వీసాలు, గ్రీన్‌ కార్డులు సులభంగా లభిస్తున్నాయి. ఫలితంగా, భారత్‌కు ’బ్రెయిన్‌ డ్రెయిన్‌’ సమస్య తీవ్రమవుతోంది. దేశం పెంచిన నైపుణ్యాలు విదేశాలకు ప్రయోజనం చేకూరుతున్నాయి.

వలసలతో పెరుగుతున్న బహిష్కరణలు..
భారత్‌ నుంచి వలసలు పెరుగుతుండడంతో అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా వలసల నియంత్రణపై దృష్టి పెట్టాయి. 2025లో 24,600 మంది భారతీయులు విదేశాల నుంచి డిపోర్ట్‌ అయ్యారు. అమెరికా నుంచి 10 వేల మందికిపైగా యూరప్‌ దేశాల నుంచి 5 వేల మంది తిరిగి వచ్చారు. వీసా మోసాలు, అక్రమ ఉద్యోగాలు, ఆశ్రయం కోరుకుని చట్టాలు ఉల్లంఘించడం కారణంగా వీరిని తిప్పి పంపుతున్నారు. అమెరికాలో ’ఫేక్‌ మ్యారేజ్‌’ వీసాలు, కెనడాలో అధికారులకు అవినీతి చేసిన కేసులు పెరిగాయి. యూరప్‌లో మెడిటెర్రేనియన్‌ మార్గాల ద్వారా అక్రమ వలసలు పట్టుబడి బహిష్కరణకు గురవుతున్నారు.

వలసలకు ప్రధాన కారణాలు..
దేశంలో యువకులకు ఉద్యోగాలు 10–12% మాత్రమే లభిస్తున్నాయి. 2025లో 1.5 కోట్లు ఉద్యోగ ఆకాంక్షలు ఉన్నా, కేవలం 20 లక్షల పొజిషన్లు మాత్రమే. ఇక వేతనాల్లోనూ భారీగా తేడా ఉంటుంది. విదేశాల్లో భారీగా వేతనాలు వస్తున్నాయి. ఇండియన్‌ కరెన్సీలో అవి మరింత పెరుగుతున్నాయి.

పరిష్కార మార్గాలు..
ప్రభుత్వం ’మేక్‌ ఇన్‌ ఇండియా’ను బలోపేతం చేసి, 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి. స్కిల్‌ ఇండియా ప్రోగ్రామ్‌ను డబ్బులు పెంచి, విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలి.

వలసదారులకు ఓసీఐ కార్డులు, డ్యూయల్‌ సిటిజన్‌షిప్‌ను పరిగణించాలి. ఎన్‌జీవోలు, రాయబారుల ద్వారా అవగాహన క్యాంపెయిన్‌లు నడపాలి. ఎన్‌ఆర్‌ఐలను ఆకర్షించే ‘రివర్స్‌ బ్రెయిన్‌ డ్రెయిన్‌’ విధానాలు అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular