Homeఆంధ్రప్రదేశ్‌Pedapati Mohan Sri Ramakrishna: ఇతడి స్టోరీ చదవండి.. సర్కారు బడి గొప్పదనం ఏంటో తెలుస్తుంది..

Pedapati Mohan Sri Ramakrishna: ఇతడి స్టోరీ చదవండి.. సర్కారు బడి గొప్పదనం ఏంటో తెలుస్తుంది..

Pedapati Mohan Sri Ramakrishna: వేలకు వేలు.. లక్షలకు లక్షలు.. కొన్ని సందర్భాలలో కోట్లు కూడా పోసి ప్రవేటు పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తుంటారు. కొన్ని సందర్భాలలో అప్పులు చేసి కూడా పదిమందిలో తమ స్థాయిని చూపించుకోవడానికి పిల్లల్ని ప్రవేటు బడులకు పంపిస్తుంటారు. ప్రవేటు బడుల్లో చదివితే గొప్ప జ్ఞానం వస్తుందా.. గొప్ప స్థానంలో పిల్లలు ఉంటారా.. ఉన్నత ఉద్యోగాలు చేస్తారా.. దీనికి ఎవరు పెద్దగా భరోసా ఇవ్వరు. నేడు మనం చూస్తున్న గొప్ప గొప్ప వాళ్లంతా […]

Pedapati Mohan Sri Ramakrishna: వేలకు వేలు.. లక్షలకు లక్షలు.. కొన్ని సందర్భాలలో కోట్లు కూడా పోసి ప్రవేటు పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తుంటారు. కొన్ని సందర్భాలలో అప్పులు చేసి కూడా పదిమందిలో తమ స్థాయిని చూపించుకోవడానికి పిల్లల్ని ప్రవేటు బడులకు పంపిస్తుంటారు. ప్రవేటు బడుల్లో చదివితే గొప్ప జ్ఞానం వస్తుందా.. గొప్ప స్థానంలో పిల్లలు ఉంటారా.. ఉన్నత ఉద్యోగాలు చేస్తారా.. దీనికి ఎవరు పెద్దగా భరోసా ఇవ్వరు.

నేడు మనం చూస్తున్న గొప్ప గొప్ప వాళ్లంతా ప్రైవేట్ బడుల్లో చదివినవారు కాదు. సర్కారు పాఠశాలలో విద్యను అభ్యసించినవారు. వారంతా కూడా విశ్వవిఖ్యాత స్థానంలో ఉన్నారు. గూగుల్ నుంచి మొదలుపెడితే amazon వరకు.. పెప్సీ నుంచి మొదలు పెడితే హిందుస్థాన్ యూనిలీవర్ వరకు ఇలా పెద్ద పెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్న వారంతా ప్రైవేట్ బడుల్లో చదివిన వారు కాదు. అంతంత మాత్రమే సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవారు.

నేటి కాలం టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. రోజురోజుకు కొత్త సాంకేతికత మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఎంతటి మార్పులకు శ్రీకారం చుడుతుందో ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. ఇటువంటి కాలంలో.. అది కూడా టెక్నాలజీని గుప్పిట్లో పట్టుకొని.. దానిని ఒక ఆట ఆడించాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఒక బాలుడు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సరికొత్త మార్పులకు కారణమవుతున్న ఓపెన్ ఏఐ సెక్యూరిటీ సిస్టమ్స్ లోని కీలకమైన భద్రతా లోపాలను గుర్తించాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. అతని పేరు పెదపాటి మోహన శ్రీరామ్ కృష్ణ. ఇతను రాజమహేంద్రవరంలోని సంపత్ నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఆర్ జి యు కె టి నూజివీడు నుంచి బీటెక్ చదివాడు. ఇతని సహచరులు జైస్వాల్.. రాహుల్.. మైని తో కలిసి హాక్ ట్రాన్ పేరుతో ఏఐ బృందాన్ని ఏర్పాటు చేశాడు.

ఈ బృందం కమ్యూనిటీ ఫోరం.. ఉద్యోగుల ఖాతాలో ఉన్న సెక్యూరిటీ లోపాలను గుర్తించింది. ఆంత్రో పిక్ కంపెనీకి చెందిన క్లౌడ్ ఏఐ మోడల్ ను ఉపయోగించి కేవలం 72 గంటల్లో మూడువేల డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో ఓపెన్ ఏఐసిస్టంలోని ప్రైవేట్ గెట్ హబ్ రిపాజటరి సిస్టం వరకు యాక్సెస్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎథికల్ హ్యాకింగ్ లో వారు చేసిన పరిశోధన వల్ల ఈ లోపాలను గుర్తించడం సాధ్యమైంది. ఆ తర్వాత వారు ఓపెన్ ఏ ఐ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఆ లోపాలను సరి చేయడంలో సహాయం చేశారు. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ సంస్థ వారికి రివార్డ్ కూడా ఇచ్చింది. మరోవైపు రాజానగరంలో మోహన్ ఎలక్ట్రో వోల్ట్ సెక్యూరిటీ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది సైబర్ సెక్యూరిటీ అందిస్తుంది.

మోహన శ్రీ రామకృష్ణ సంపత్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాడని చెప్పాం కదా.. ఆ పాఠశాలలో అంతంత మాత్రంగానే సౌకర్యాలు ఉన్నాయి. పైగా మోహన శ్రీ రామకృష్ణ చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు. బీటెక్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలోనే చదువుకున్నాడు. తన నైపుణ్యాలు పెంచుకున్నాడు. తన లోపాలను సవరించుకున్నాడు. సౌకర్యాలు లేవని బాధపడలేదు. సకాలంలో ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదని ఇబ్బంది పడలేదు. ఉన్నదాంట్లోనే సంతృప్తిపడ్డాడు. ర్యాంకులు.. మార్కుల చుట్టూ తిరగలేదు. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వైపు మాత్రమే దృష్టి సారించాడు. అందువల్ల నేడు ఈ స్థాయిలో పేరు సంపాదించాడు. మార్కులు వేరు.. ర్యాంకులు వేరు.. జ్ఞానం వేరు.. డబ్బున్న వాళ్ళు మొదటి రెండింటి కోసం ఆశపడతారు. చదువు అంటే ఇష్టం ఉన్నవారు చివరి దాని కోసం తాపత్రయపడతారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper