Homeటాప్ స్టోరీస్Vemula Prashanth Reddy: కాంగ్రెస్ నేతలతో కవిత రహస్య మీటింగ్.. అసలు విషయాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్...

Vemula Prashanth Reddy: కాంగ్రెస్ నేతలతో కవిత రహస్య మీటింగ్.. అసలు విషయాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి..

Vemula Prashanth Reddy: వ్యాపారుల లోగొట్టును సారా దుకాణం బయటపెట్టినట్టు.. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిలో మాజీ, ప్రస్తుత నాయకుల అసలు వ్యవహారాన్ని నిజామాబాద్ నగరం బయటపడుతోంది. సోమవారం తన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రిగా ఆమె నిర్వహించిన సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. తనను పార్టీ నుంచి బయటికి గెంటేశారని ఆరోపించారు. ఆడపిల్ల ఏడిస్తే పార్టీకి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం […]

Vemula Prashanth Reddy: వ్యాపారుల లోగొట్టును సారా దుకాణం బయటపెట్టినట్టు.. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిలో మాజీ, ప్రస్తుత నాయకుల అసలు వ్యవహారాన్ని నిజామాబాద్ నగరం బయటపడుతోంది.

సోమవారం తన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రిగా ఆమె నిర్వహించిన సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. తనను పార్టీ నుంచి బయటికి గెంటేశారని ఆరోపించారు. ఆడపిల్ల ఏడిస్తే పార్టీకి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని బయటికి పంపించారని ఆమె గట్టిగా నిలదీశారు. ఒకరకంగా తన ఆవేదన మొత్తం బయటపెట్టుకున్నారు. అంతేకాదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ మండిపడ్డారు.

కవిత ఆరోపణలు చేసింది మామూలు వ్యక్తి మీద కాదు. ప్రశాంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో అత్యంత కీలక నాయకుడు. పైగా ఈయన కెసిఆర్ కు అత్యంత దగ్గర వ్యక్తి. కెసిఆర్ ఫోల్డ్ లో ఉండే నాయకులనే ఈమధ్య కవిత టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్.. హరీష్ రావు.. సంతోష్ రావు.. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మీద కవిత విమర్శలు చేశారు. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి చేతకాని పనిని కవిత చేసి చూపిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తలదించుకోవాలి. ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా కాంగ్రెస్ మీద దూకుడు ప్రదర్శిస్తుంది. ఎదురు దాడి చేస్తోంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంజీవని లాగా మారారు కల్వకుంట్ల కవిత. పాయింట్ టు పాయింట్.. ఆమె అడుగుతున్న తీరు.. ప్రశ్నిస్తున్న తీరు డిబేటబుల్గా ఉంది. అందువల్లే ఆమె ప్రశ్నలకు గులాబీ పార్టీ నాయకులు కౌంటర్ కాదు కదా.. కనీసం స్పందించలేకపోతున్నారు.

ఇప్పుడు ఇక ప్రశాంత్ రెడ్డి కవిత చేసిన విమర్శల మీద స్పందించాల్సి వచ్చింది.. తాను కాంగ్రెస్ పార్టీ నేతలను కలవలేదని.. కలిసే కర్మ కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కల్వకుంట్ల కవిత అత్యంత రహస్యంగా కలిశారని.. తన వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి బాంబు పేల్చారు. అంతేకాదు ఈ విషయంలో దేవుడు ముందు ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ కవితకు సవాల్ విసిరారు. మరి ఈ విషయంలో కవిత ప్రశాంత్ రెడ్డి సవాల్ స్వీకరించగలుగుతారా.. తాను కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసింది లేదని నిరూపించుకోగలుగుతారా.. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఏది ఏమైనాప్పటికీ భారత రాష్ట్ర సమితి నాయకులను బయటికి లాగడంలో.. మీడియా ముందు సంజాయిషి ఇచ్చేలా చేయడంలో కవిత నూటికి నూరు శాతం కాదు.. కోటి శాతం విజయవంతమయ్యారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper