Homeటాప్ స్టోరీస్KCR Kavitha Rift : కేసీఆర్ తో కవితను ఎడబాపింది హరీష్, సంతోష్ కాదా.. కథ...

KCR Kavitha Rift : కేసీఆర్ తో కవితను ఎడబాపింది హరీష్, సంతోష్ కాదా.. కథ పెద్దగానే ఉందిగా..

KCR Kavitha Rift : కవిత.. కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన కూతురు. ఆయన చేసే ప్రతి పనిలో కూడా కూతురు ఎదురుపడేలా చూసుకునేవారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. కేసీఆర్ కు మంగళ హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికింది కూడా కవితనే. అంతటి ప్రేమ ఉన్న కవిత తన తండ్రికి దూరమైంది. తన తండ్రి ఏర్పాటుచేసిన పార్టీ నుంచి బయటికి వచ్చింది. ఒక రకంగా బయటికి వచ్చింది అని చెప్పే కంటే.. ఆమెను […]

KCR Kavitha Rift : కవిత.. కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన కూతురు. ఆయన చేసే ప్రతి పనిలో కూడా కూతురు ఎదురుపడేలా చూసుకునేవారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. కేసీఆర్ కు మంగళ హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికింది కూడా కవితనే.

అంతటి ప్రేమ ఉన్న కవిత తన తండ్రికి దూరమైంది. తన తండ్రి ఏర్పాటుచేసిన పార్టీ నుంచి బయటికి వచ్చింది. ఒక రకంగా బయటికి వచ్చింది అని చెప్పే కంటే.. ఆమెను బయటికి పంపించారు అనడం సబబు. కవిత తన తండ్రి పార్టీ నుంచి బయటికి రావడం కంటే ముందు.. ఆమె రాసిన లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన తండ్రికి రాసిన లేఖలు బయటపడిన వ్యవహారంలో కవిత తీవ్రంగా కలత చెందారు. ఆ లికు వీరులు ఎవరో తేలాలి అంటూ గట్టిగా మాట్లాడారు. నాడు తన కొడుకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరై.. తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత.. తన తండ్రికి తాను రాసిన లేఖల వ్యవహారాన్ని ఆమె బయటపెట్టారు. ఈ లేఖలను లీక్ చేసిన వ్యక్తులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అప్పట్లో ఈ లేఖలను లీక్ చేసిన వ్యక్తులు కెసిఆర్ కు అత్యంత దగ్గరగా ఉండే వారే అని తర్వాత తేలింది. కెసిఆర్ కు అత్యంత దగ్గరగా ఉండేది హరీష్ రావు.. సంతోష రావు.. కేటీఆర్.. వారికి తెలియకుండా కేసీఆర్ కు సంబంధించిన ఏ విషయం కూడా బయటికి రాదు. అలాంటప్పుడు నాడు కవిత ఆరోపణలు చేసింది వీరి ముగ్గురి మీద నేనని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కవిత ఆరోపణలు అకస్మాత్తుగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మీదికి మళ్ళాయి. ప్రశాంత్ రెడ్డి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. ఈయన కెసిఆర్ కు అత్యంత దగ్గర వ్యక్తిగా ముద్రపడ్డారు. అయితే ప్రశాంత్ రెడ్డి వల్లనే తన తల్లికి తాను దూరమైనట్టు కవిత ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్రశాంత్ రెడ్డి లేనిపోని మాటలు చెప్పడం వల్లే తన తండ్రి దూరం పెట్టాడని కవిత ఆరోపించింది.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఎవరో చెప్పిన మాటలు విని.. కవితను తండ్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ఎలా దూరం పెడతారు.. కవిత అంటే కెసిఆర్ కు అత్యంత ఇష్టమైన కూతురు కదా.. ఒక దశలో కవిత ఆయనకు అన్ని అయ్యారు కదా.. అలాంటప్పుడు ప్రశాంత్ రెడ్డి చెప్పిన మాటలు విని కెసిఆర్ కవితను ఎందుకు దూరం పెడతారు.. కవిత చెప్పిన దాంట్లో లాజిక్ లేదు. మరోవైపు కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి విలేకరుల ముందుకు వచ్చారు. అంతేకాదు, కెసిఆర్ కు, కవితకు మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినట్టు చెప్పారు. తండ్రి కూతుర్ల మధ్య పంచాయతీ ఏర్పడితే.. తాను సెటిల్ చేయడానికి ప్రయత్నించినట్టు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కెసిఆర్ కుటుంబంలోకి బయట వ్యక్తులకు అంత ఈజీగా పర్సనల్ విషయాలు డిస్కస్ చేసే యాక్సస్ ఉంటుందా.. మీడియా ప్రశ్నిస్తోంది కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఏదో చెప్పబోయారు. కానీ అది కవరింగ్ అని అందరికీ అర్థమైంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper