KTR And Kavitha: కొద్దిరోజులుగా భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కనిపించడం లేదు. ఏమని ఆరా తీస్తే.. ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన కూతురు విదేశీ విద్య నిమిత్తం.. ఆయన ఫారిన్ కంట్రీ కి వెళ్లారు.
రేపు దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి జరగబోతోంది. రాఖీ పౌర్ణమి రోజు సోదర సోదరీమణులు రాఖీలు కట్టుకుంటారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కడితే అంతా శుభం జరుగుతుందని నమ్ముతుంటారు. రాఖీ కట్టినందుకు సోదరులు సోదరీమణులకు తమ స్థాయికి తగ్గట్టుగా కానుకలు ఇస్తుంటారు ఈ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధాన్ని బలోపేతం చేస్తూ ఉంటుంది.
ఈ పండుగకు మనదేశంలో ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. పైగా ఈ పండుగను కులాలు.. మతాలతో సంబంధం లేకుండా మనదేశంలో జరుపుకుంటారు. కుటుంబంలో అన్ని బాగున్నప్పుడు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఆయన సోదరీమణి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత రాఖీ కట్టేవారు. అందకంటే ముందుగానే తన సోదరుడికి రాఖీ కట్టి.. తన ప్రేమను వ్యక్తం చేసేవారు. తన సోదరుడు దగ్గరనుంచి ఆశీర్వాదం కూడా తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు. కవిత ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాడకూడదని కేటీఆర్ గట్టిగా భీష్మించుకొని కూర్చున్నారు. పైగా ఇద్దరి మధ్య అనుకూలమైన సంబంధాలు లేవు. కేటీఆర్ మీద కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే తన బాపు పదేళ్ల పరిపాలన కాలాన్ని ఆమె పదేపదే ప్రశ్నిస్తున్నారు.
తాజాగా కూడా కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రాఖీ పౌర్ణమి గురించి అక్కడున్న విలేకరులు ప్రస్తావిస్తే కవిత దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్పారు. కేటీఆర్ కు తాను రాఖీ కడదామని అనుకున్నానని.. కానీ ఆయన విదేశాలకు వెళ్లిపోయాడని.. అలాంటప్పుడు ఏం చేస్తామని కవిత నిర్వేదం వ్యక్తం చేశారు. గతంలో లిక్కర్ కేసులో జైలు శిక్ష అనుభవించిన కవిత.. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత.. కేటీఆర్ కు రాఖీ కట్టారు. ఆ సందర్భాన్ని గొప్పగా చెప్పుకున్నారు. రాఖీ పండుగ పూర్తయిందని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. గత ఏడాది కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు కూడా విదేశాల్లోనే ఉన్నారు. దీనిని బట్టి తనను అవాయిడ్ చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్ అనుసరిస్తున్న విధానాలు కూడా అదే విధంగా ఉన్నాయి
View this post on Instagram