KTR And Jagan: ఆస్తులు.. అంతస్తులు.. పదవులు.. వీటి కోసమే కదా పెద్దపెద్ద కుటుంబాలలో జరిగే కొట్లాటలు. డబ్బు తాత్కాలికమని తెలుసు. పదవులు శాశ్వతం కాదని తెలుసు. అయినప్పటికీ పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు వాటికోసం పాకులాడటం.. పోరాటాలు సాగించడం.. చివరికి అయిన వాళ్ళ తో తగువులు పెట్టుకోవడం విశేషం.
తెలుగు నాట రాజకీయ కుటుంబాలలో కుటుంబ సభ్యుల మధ్య తగువులు కొత్తకాదు. అధికారం కోసం.. ఆస్తుల కోసం.. ఇతర వ్యవహారాల కోసం తగువులు పెట్టుకొని దూరమైన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ జాబితాలోకి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవిత.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల చేరిపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీరిద్దరి కూడా తమ సోదరులకు అత్యంత ఇష్టమైన సోదరీమణులు. జగన్ జైలో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. ఒక రకంగా 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి షర్మిల ముఖ్యపాత్ర పోషించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేశారు కల్వకుంట్ల కవిత. తన సోదరుడు కేటీఆర్ మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినప్పుడు మొహమాటం లేకుండా ఖండించారు కవిత.. అయితే ఎంతో బలమైన బంధాన్ని కొనసాగించిన వీరిద్దరూ తమ సోదరులతో విభేదించడం ఆధునిక రాజకీయాలలో ఒక వైచిత్రి లాగా మారిపోయింది.
ఇప్పటికీ కేటీఆర్ మీద కవిత విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ మీద కూడా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీని వెనుక కారణాలు ఏమై ఉన్నప్పటికీ.. సొంత సోదరీమణులు రాజకీయ ప్రత్యర్థులుగా మారి విమర్శలు చేయడం ఒక రకంగా కేటీఆర్ కు.. జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే.
ఫ్యూచర్లో అటు షర్మిల.. ఇటు కవిత తమ సోదరులకు ఇలాగే వైరి వర్గం లాగా ఉంటారా.. లేదా కలిసిపోతారా.. రక్తసంబంధం లో ఇటువంటి వివరాలు సర్వసాధారణమని చాటి చెబుతారా.. ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెప్పారు ఓ సిద్ధాంతి. పెద్ద పెద్ద కుటుంబాలలో ఇటువంటి గొడవలు సాధారణమని.. అవి తాత్కాలికమైనవి మాత్రమేనని.. అవి దీర్ఘకాలం సాగే అవకాశం లేదని ఆయన కొట్టి పారేశారు. అంతేకాదు ఇటువంటి గొడవలు జరిగిన తర్వాత వ్యక్తుల మధ్య ప్రేమలు పెరిగిపోతాయని.. ఒక దశలో ద్వేషాన్ని.. కోపాన్ని పక్కన పెట్టి కలిసి పోతారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడిన మాటలను ఆ సిద్ధాంతి ప్రస్తావించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒకవేళ కేటీఆర్ కనుక విదేశాలలో కాకుండా ఇక్కడే ఉండి ఉంటే కచ్చితంగా కవిత రాఖీ కడతారని.. కానీ ఆయన విదేశాలకు వెళ్లడం వల్లే కవిత ఇబ్బంది పడుతున్నారని.. దీన్నిబట్టి ఈ గొడవలు శాశ్వతం కాదని.. తాత్కాలికం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన చెబుతున్నారు. ఒకవేళ ఆయన చెప్పినట్టుగా కవిత.. షర్మిల గనుక చేస్తే రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైన పరిణామంగానే గుర్తుండిపోతుంది.
ఫ్యూచర్ లో కేటీఆర్-కవిత కలుస్తారా?
ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ ముళ్ళపూడి సత్యనారాయణ క్లారిటీ #KTR #Kavitha #MullapudiSatyanarayana pic.twitter.com/8eYWsDnBOx
— Telugu360 (@Telugu360) August 28, 2026