HomeతెలంగాణBandla Ganesh: బండ్ల గణేష్ ఆర్థికంగా చితికిపోయాడా.. ఆస్తులు వేలం వేసిన బ్యాంకు.. కోర్టుకు పంచాయితీ

Bandla Ganesh: బండ్ల గణేష్ ఆర్థికంగా చితికిపోయాడా.. ఆస్తులు వేలం వేసిన బ్యాంకు.. కోర్టుకు పంచాయితీ

Bandla Ganesh: మొన్ననే కదా బండ్ల గణేష్ తన కుమార్తె వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపింది. పైగా ఆయన ఆర్థికంగా అత్యంత స్థితి మంతుడు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా. ఆంధ్ర ప్రదేశ్.. కర్ణాటక.. తమిళనాడు ప్రాంతాలలో భారీగా కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నాడు. గుడ్ల పరిశ్రమలో కూడా అగ్రభాగంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ఉంది. టెంపర్, బాద్ షా, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా తీశాడు. ఇంతటి స్థాయి […]

Bandla Ganesh: మొన్ననే కదా బండ్ల గణేష్ తన కుమార్తె వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపింది. పైగా ఆయన ఆర్థికంగా అత్యంత స్థితి మంతుడు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా. ఆంధ్ర ప్రదేశ్.. కర్ణాటక.. తమిళనాడు ప్రాంతాలలో భారీగా కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నాడు. గుడ్ల పరిశ్రమలో కూడా అగ్రభాగంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ఉంది. టెంపర్, బాద్ షా, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా తీశాడు.

ఇంతటి స్థాయి కలిగిన బండ్ల గణేష్ ఆర్థికంగా చితికిపోయాడా.. ఆయనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయా.. వాటిని వేలం కూడా వేశాయా.. ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెబుతున్నారు విశ్లేషకులు. బండ గణేష్, ఆయన కుటుంబానికి సంబంధించిన ఒక ఆస్తిని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ వేలం వేసింది.. అంతేకాదు వేలం వేసిన విషయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. వేలం వేసిన సొమ్మును బండ్ల గణేష్ కుటుంబానికి చెల్లించాలని డి.ఆర్.టి ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి పడేసింది.

యూనియన్ బ్యాంకు తమ ఆస్తిని వేలం వేసిందని.. వచ్చిన ఆ సొమ్మును తమకు చెల్లించాలని బండ్ల గణేష్.. అతడి తండ్రి.. సోదరుడు డిఆర్టి దృష్టికి తీసుకెళ్లారు. డిఆర్టిలో వీళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టులో పిటిషన్ వేసింది దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్యాంకు తరఫున సీనియర్ న్యాయవాది బిఎస్ ప్రసాద్ కోర్టులో వాదించారు.

బండ్ల గణేష్ కుటుంబం శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ లిమిటెడ్ పేరు మీద లోన్ తీసుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించకపోవడంతో బండ్ల గణేష్ కుటుంబానికి సంబంధించిన ఆస్తిని 2019లో యూనియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. 2022లో వేలం వేసింది. తద్వారా 8.5 వన్ కోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిటిషనర్లు వన్ టైం సెటిల్మెంట్ కింద అపోలు మొత్తం చెల్లిస్తామని ముందుకు వచ్చారు. దానికి యూనిట్ బ్యాంక్ ఒప్పుకుంది. ఆ సమయంలో వన్ టైం సెటిల్మెంట్ కింద 82 కోట్ల చెల్లింపుకు యూనియన్ బ్యాంకు ఒప్పుకుంది. అందులో వేలం సొమ్ము 8.51 కోట్లను మినహాయించుకుంటామని చెప్పింది. అయితే వేలం వేసిన విధానాన్ని సవాల్ చేయడం.. యూనియన్ బ్యాంక్ మీద వేసిన పిటిషన్లను వెనక్కి తీసుకోవడానికి బండ్ల గణేష్ ఒప్పుకున్నారు.

పిటిషన్ లను వెనక్కి తీసుకోకుండానే డిఆర్టి ని గణేష్ ఆశ్రయించారు. యూనియన్ బ్యాంక్ రికార్డులను పరిశీలించకుండా డిఆర్టి ఏకపక్షంగా వేలాన్ని రద్దు చేసింది.. ” ఎన్సిఎల్టిలో దివాలా పరిష్కార ప్రక్రియను అనుమతించింది. ఆస్తుల క్రయవిక్రాలపై నిషేధం ఉంది. అలాంటప్పుడు వేలం నిర్వహించకూడదని చెప్పడం సరికాదు. ఇది కంపెనీ ఆస్తి కాదు. హామీ ఇచ్చిన వారి ఆస్తి. దానిమీద ఎటువంటి నిషేధం ఉండదు. అందువల్లే డిఆర్టి తీర్పును రద్దు చేస్తున్నామని” హైకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper