Homeఆంధ్రప్రదేశ్‌Bandla Ganesh: బండ్ల గణేష్ పిలిస్తే పలుకుతున్న సీఎంలు.. ఆ సీక్రెట్ ఏంటి..

Bandla Ganesh: బండ్ల గణేష్ పిలిస్తే పలుకుతున్న సీఎంలు.. ఆ సీక్రెట్ ఏంటి..

Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాదులో జరిగిన ఈ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు.. రేవంత్ రెడ్డి.. భారత రాష్ట్ర సమితి నాయకులు కేటీఆర్.. భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ పెళ్లి రెండు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు.. ఉన్నత అధికారులు.. సెలబ్రిటీలు.. సమాజంలో పేరుపొందిన వ్యక్తులు మొత్తం ఈ పెళ్లికి హాజరయ్యారు.. […]

Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాదులో జరిగిన ఈ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు.. రేవంత్ రెడ్డి.. భారత రాష్ట్ర సమితి నాయకులు కేటీఆర్.. భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ పెళ్లి రెండు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు.. ఉన్నత అధికారులు.. సెలబ్రిటీలు.. సమాజంలో పేరుపొందిన వ్యక్తులు మొత్తం ఈ పెళ్లికి హాజరయ్యారు.. భారతీయ జనతా పార్టీ నుంచి మొదలు పెడితే జనసేన వరకు ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఈ వివాహానికి హాజరు కావడం విశేషం. పెళ్లికి హాజరైన వారి జాబితాను గనుక రూపొందిస్తే ఖచ్చితంగా ఆయాసం వస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇటీవల కాలంలో ఒక పొలిటిషన్ కుమార్తె పెళ్లికి ఈ స్థాయిలో సెలబ్రిటీలు గాని.. హై ఫై ప్రజలు గాని హాజరు కాలేదు. దీనినిబట్టి బండ్ల గణేష్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత చాలా కాలం పాటు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానే ఉన్నారు. నిర్మాతగా కూడా అత్యంత భారీ చిత్రాలు నిర్మించలేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఇతను.. గొప్పగా చెప్పుకునే పొలిటిషన్ కూడా కాదు. కాకపోతే ఇతడికి హేచరీ వ్యాపారం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బండ్ల గణేష్ కు బలమైన పిఆర్ వ్యవస్థ ఉంది. ఇతడు స్నేహబందలను బలంగా కొనసాగిస్తుంటాడు. ఏదైనా సరే ఓపెన్ గానే చెప్పేస్తుంటాడు. ఇతనికి శత్రువుల కంటే మిత్రులు ఎక్కువగా ఉన్నారు. అందువల్లే తన కుమార్తె వివాహానికి ముహూర్తం సమయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే విధంగా చూసుకున్నారు. దీనిని బట్టి బండ్ల గణేష్ ప్లానింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

టెంపర్.. బాద్షా.. గబ్బర్సింగ్ వంటి చిత్రాల నిర్మించిన ఇతను.. ఇప్పటికీ హై ప్రొఫైల్ నిర్మాతగానే కొనసాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది తలలు పండిన నిర్మాతలు ఉన్నారు. రాజకీయాలలో కాకలు తీరిన నాయకులు ఉన్నారు. వారందరికీ సాధ్యం కాని విధంగా బండ్ల గణేష్ ఈ స్థాయిలో రాజకీయ నాయకులను.. సినిమా తారలను.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తన కుమార్తె వివాహానికి రప్పించుకున్నారంటే బండ్ల గణేష్ మామూలు వ్యక్తి కాదు. కాకపోతే రాజకీయ నాయకుడిగా.. వ్యాపారిగా.. ఇతర వ్యవహారాలతో కాకుండా.. కేవలం వ్యక్తిగా సంపాదించిన స్థాయి ఎక్కువ. అందువల్లే తన కుమార్తె జనని వివాహాన్ని ఈ స్థాయిలో జరిపించారు బండ్ల గణేష్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper