Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె జనని పెళ్లి రీసెంట్ గానే హైదరాబాద్ లో ఎంత గ్రాండ్ గా జరిగిందో మనమంతా చూసాము. ఈ పెళ్ళికి సినీ , రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. బండ్ల గణేష్ ఆనందాన్ని చూసి ప్రతీ తండ్రి తమని తాము బండ్ల గణేష్ లో చూసుకున్నారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పగింతల సమయం లో బండ్ల గణేష్ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే పెళ్ళికి ముందు ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమం కూడా చాలా అట్టహాసం గా జరిగింది. ఈ కార్యక్రమం లో బండ్ల గణేష్ కుమారుడు , కూతురుతో పాటు అల్లుడు సూర్య తేజ వేసిన డ్యాన్స్ స్టెప్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఈ సంగీత్ ఈవెంట్ లో బండ్ల గణేష్ తన అల్లుడు డ్యాన్స్ ని చూసి షాక్ కి గురై మాట్లాడిన కొన్ని మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం.. మీ అందరి ముందు మా అల్లుడి దగ్గర నుండి ఒక మాట తీసుకుంటున్నాను. నువ్వు దయచేసి సినిమా ఇండస్ట్రీ లోకి రాకూడదు బాబు. నీకు పొరపాటున నటుడు అవ్వాలనే ఆలోచన ఉన్నా, ఈరోజే ఆ ఆలోచన చచ్చిపోవాలి. ఎందుకంటే, వ్యాపారస్తుడికే నా కూతుర్ని ఇస్తాను. నువ్వు బాగా వ్యాపారం చెయ్యాలి, ఉన్నత స్థాయికి రావాలి, కానీ సినిమాలు వద్దు. నీ డ్యాన్స్ చూస్తే నా గుండెల్లో దడ మొదలైంది. మామయ్య సినిమా తియ్యి అంటే , నేను మాత్రం తియ్యను, ఇక్కడున్న డైరెక్టర్లు , హీరోలందరూ నా అల్లుడి డ్యాన్స్ చూసి ఇక్కడే మర్చిపోవాలని కోరుకుంటున్నాను. ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడని నేనైతే అనుకోలేదు, మా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ని తీసుకొని రావాలని అనుకుంటే , హీరో లాంటి అల్లుడిని తీసుకొచ్చానే అనే అనుమానం వచ్చింది. నువ్వు హీరోవి కాదు , వ్యాపారవేత్తవి మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ఇదే సంగీత్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పెద్ద కుమారుడు వేసిన డ్యాన్స్ కూడా అద్భుతంగా అనిపించింది. బండ్ల గణేష్ మాటలను బట్టీ చూస్తుంటే , ఆయన కొడుకుని హీరో గా ఇండస్ట్రీ తీసుకొచ్చేలా ఉన్నాడు. గత కొంత కాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్న బండ్ల గణేష్ , ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈ రీ ఎంట్రీ లో మొదటి సినిమా ఆయన కొడుకుతోనే చేస్తాడా ? , లేదా వేరే హీరో తో చేస్తాడా అనేది చూడాలి.
View this post on Instagram