Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు వస్తున్నాయి. అత్యంత కష్టమైన పనులు కూడా ఈజీ అయిపోతున్నాయి. అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయింది. తద్వారా అన్ని రంగాలలో మనుషులు చేసే పని తగ్గిపోయింది. అందువల్లే చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద
పడుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పటివరకు ఉద్యోగాలు పోతున్నట్టు మాత్రమే వార్తలు విన్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏకంగా ఉద్యోగులను కూడా తొలగిస్తోంది. దీనికి సంబంధించిన సంఘటన వెస్ట్రన్ కంట్రీలో జరిగింది. అమెరికాలోని అండన్ ల్యాబ్స్ అనే పరిశోధన సంస్థ.. అండన్ మార్కెట్ పేరుతో ఒక ప్రయోగాత్మకమైన రిటైల్ స్టోర్ నడుపుతోంది. ఈ స్టోర్ కు సంబంధించిన నిర్వహణ.. సిబ్బంది పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం ఆంత్రోపిక్ క్లౌడ్ ఆధారిత లూనా ఏఐ మేనేజర్ కు అప్పగించారు.
ఈ స్టోర్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పని తీరును సరిగా లేకపోవడంతో తీవ్రంగా పరిగణించింది. మొత్తంగా 23 షిఫ్టులలో అతడు 17 షిఫ్ట్ లకు ఆలస్యంగా వచ్చాడు. సమయాన్ని పాటించకపోవడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల.. అతడి తీరును ఏఐ మేనేజర్ తీవ్రంగా పరిగణించింది.. అయితే మొదట్లో ఆ ఉద్యోగి ఆలస్యాన్ని ఏ మేనేజర్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే సంస్థ నిబంధనల పుస్తకాన్ని సమీక్షించాలని ఇటీవల కోరగా.. లూనా రికార్డులను మొత్తం పరిశీలించింది. నిబంధన ప్రకారం ఉద్యోగిని పక్కన పెడుతున్నట్టు ప్రకటించింది.
ఇప్పటివరకు అన్ని రంగాలలో చిన్న చిన్న తప్పులను సవరించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించేవారు. వ్యాపారం నిర్వహించడం.. ఇంటర్వ్యూలు చేసి మనుషులను ఉద్యోగులకు తీసుకెళ్లడం.. లేదా తొలగించడం వంటి వాటి కోసం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం ఇదే తొలిసారి.. అయితే భవిష్యత్తు కాలంలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను ఇదే తీరుగా ఉపయోగిస్తే ఉద్యోగాలు ఉండవని.. ఉద్యోగులు ఎవరూ పనిచేయరని.. టెక్నాలజీ నిపుణులు అంటున్నారు.
ఆర్టిపిషియల్ ఇంటలిజెన్స్ వల్ల కఠినమైన పనులు కూడా ఈజీ అయిపోతున్నాయి. ఈ టెక్నాలజీని ఇంత వరకు ఉపయోగించుకుంటే బాగుండేది. కానీ మనుషులకు ప్రత్యామ్నాయంగా ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల భవిష్యత్ కాలంలో అన్ని రంగాలలో ఉద్యోగులు ఉండరని..అది పని సంక్షోభానికి దారి తీస్తుంది. అప్పుడు అన్ని రంగాలు తీవ్రమైన ప్రమాదంలో పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.