Homeబిజినెస్Software Engineer: 14 ఏళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్..జాబ్ మానేసి.. నెలకు 16 లక్షల సంపాదన..

Software Engineer: 14 ఏళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్..జాబ్ మానేసి.. నెలకు 16 లక్షల సంపాదన..

Software Engineer: ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాన్ని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఐదు అంకెల జీతం ఉంటుంది. అన్నిటికీ మించి సౌలభ్యాలు ఉంటాయి. ఇంటికే క్యాబ్ వస్తుంది.. ఆఫీసులో మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. ఈవినింగ్ టీ, స్నాక్స్ ఉంటాయి. ఉదయం షిఫ్ట్ అయితే టిఫిన్ కూడా పెడతారు. జీతంతో పాటు బోనస్.. అలవెన్స్ లు.. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి ఐటి ఇండస్ట్రీలో. అందువల్లే చాలామంది ఐటీ ఇండస్ట్రీలో […]

Software Engineer: ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాన్ని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఐదు అంకెల జీతం ఉంటుంది. అన్నిటికీ మించి సౌలభ్యాలు ఉంటాయి. ఇంటికే క్యాబ్ వస్తుంది.. ఆఫీసులో మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. ఈవినింగ్ టీ, స్నాక్స్ ఉంటాయి. ఉదయం షిఫ్ట్ అయితే టిఫిన్ కూడా పెడతారు.

జీతంతో పాటు బోనస్.. అలవెన్స్ లు.. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి ఐటి ఇండస్ట్రీలో. అందువల్లే చాలామంది ఐటీ ఇండస్ట్రీలో పని చేయాలని అనుకుంటారు. బీటెక్ తర్వాత.. అయితే ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి రకరకాల కోర్సులు చదువుతూ ఉంటారు. మనదేశంలో ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఐటినే. పైగా మన దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్న విభాగం కూడా ఐటినే. గతంతో పోల్చి చూస్తే ఐటి కార్యకలాపాలు మనదేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా ఒత్తిడితో కూరుకున్న వాతావరణం ఉన్నప్పటికీ.. ఇప్పటికీ నియామకాలు చెప్పుకునే స్థాయిలో జరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. కంపెనీలు విస్తరణ చేపడుతున్నాయి.

ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగం అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే ఈ వ్యక్తి మాత్రం చాలా డిఫరెంట్. 14 సంవత్సరాలపాటు ఐటీ ఉద్యోగిగా పని చేశాడు. ఆ తర్వాత ఐటీ ఇండస్ట్రీలో వాతావరణం అతడికి నచ్చలేదు. ఇంకేముంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రైతుగా మారిపోయాడు. ఏకంగా పుట్టగొడుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. వ్యాపారం మాత్రమే కాకుండా.. దానికంటే ముందుగా పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టాడు. నెలకు అక్షరాల 16 లక్షలు సంపాదిస్తున్నాడు.

ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి నెలకు 16 లక్షలు సంపాదిస్తున్న ఆ వ్యక్తి పేరు విక్రం దేవ్ మోహపాత్ర. 2012లో ఇతడు బీటెక్ పూర్తి చేశాడు. ఐటి ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. అనేక రకాల కంపెనీలలో పని చేశాడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత ఊరైన నవరంగపూర్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ గంగ భూమి మాష్రూమ్స్ పేరుతో పుట్టగొడుగుల సాగును ప్రారంభించాడు. నెలకు 15 నుంచి 18 టన్నుల ఉత్పత్తి మొదలుపెట్టాడు. నెలకు 16 నుంచి 19 లక్షలు సంపాదిస్తున్నాడు. 24 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

నేటి కాలంలో ఐటీ లో పనిచేయాలని.. భారీగా జీతభత్యాలు సంపాదించాలని చాలామంది కోరుకుంటున్నారు. ఐటీలో ఉద్యోగం పోతే.. మరో సంస్థలో అదే స్థాయి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటికీ మించి తమ సామర్ధ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇతడు మాత్రం ఐటి ఇండస్ట్రీని పక్కన పెట్టాడు. తనకు నచ్చిన రంగంలో ప్రవేశించి.. బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper