Narendarmodi RevanthReddy 80s AI: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడ్డానికి కుర్రాడి మాదిరిగా ఉంటారు. ఆయన జంక్ ఫుడ్ తినరు. ఆల్కహాల్ ముట్టుకోరు. పైగా ఇంట్లో వండిన ఆహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. జొన్న రొట్టె.. నాటు కోడికూరను ఆయన ఇష్టంగా తింటూ ఉంటారు.
ఉన్నట్టుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటో 80ల కాలంలో దిగినట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి అచ్చం ఆ ఫోటోలో సినిమా హీరో మాదిరిగా కనిపించారు. డెనిమ్ జీన్స్.. వైట్ షర్ట్.. ఇన్సర్ట్ వేసుకొని.. హీరో లాగా కనిపించారు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. అందరు సెలబ్రిటీలు.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు.. 80ల కాలం మాదిరిగా ఫోటోల రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
వాస్తవానికి ఇలాంటి ఆలోచన వారికి రావడానికి ప్రధాన కారణం చాట్ జిపిటి. ప్రస్తుతం ఆధునిక కాలంలో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే నోస్టాల్జియా ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెరమీదకి తీసుకొచ్చింది. అందువల్లే సోషల్ మీడియాలో 1980ల కాలం నాటి (80s AI Trend) ఫోటోల ట్రెండ్ భారీగా మొదలైంది. సోషల్ మీడియా వేదికలలో యూజర్లు తమ ప్రస్తుత ఫోటోలను 1980ల కాలం నాటి వింటేజ్ లుక్ లోకి మార్చుకుంటూ.. ఈ వినూత్నమైన ట్రెండ్ ను వైరల్ చేశారు.
ఈ ట్రెండ్ ఎలా మొదలైంది అంటే..
ChatGPT టెక్నాలజీతో ప్రారంభం: ఈ ట్రెండ్ ఏర్పడేందుకు ప్రధాన కారణం చాట్ జిపిటి/ డి ఎ ఎల్ ఎల్ ఈ వంటి ఏఐ చాట్ బాట్ లు. యూజర్లు తమ సాధారణ సెల్ఫీ లేదా ఫోటోలను చాట్ జిపిటికి అప్లోడ్ చేసి.. ఒక ప్రత్యేకమైన ప్రాంప్ట్ ను కనుక ఇస్తే.. అది ఫోటోను రూపొందించింది.
ప్రత్యేకమైన ప్రాంప్ట్(Prompt): ఏఐకి ప్రత్యేకమైన ప్రాంప్ట్ కనుక ఇస్తే 80 ల కాలం నాటి ఫోటోలను రూపొందించి ఇస్తుంది. దీని ద్వారా సాధారణ ఫోటోలకు కూడా ఏఐ 80 కాలం నాటి భారీ హెయిర్ స్టైల్స్.. పాతకాలం నాటి చీరకట్టు లేదా ప్రింటెడ్ షర్ట్స్.. స్టూడియో లైటింగ్.. పాత ఫిల్మ్ కెమెరాలు ద్వారా వచ్చే గ్రైన్ అండ్ కలర్ టోన్ ఎఫెక్ట్లను జోడించి అద్భుతమైన వింటేజ్ లుక్ ఇస్తూ ఉంటుంది.
ఇలా రూపొందించిన ఫోటోలను చాలామంది సోషల్ మీడియా వేదికలలో ఆడ్ యువర్ స్టిక్కర్స్ ఉపయోగించి పాతకాలపు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రీల్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు వేలం వెర్రి లాగా మారిపోయింది.
కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు.. క్రీడాకారులు.. రాజకీయ నాయకులు ఈ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఏఐ ఆధారిత 80 కాలం నాటి వింటేజీలకు ఫోటోను పంచుకున్నారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్.. కిరణ్ రిజిజు వంటి వారు కూడా తమ 80 ల కాలంనాటి లుక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతుంది.
నేటి డిజిటల్ ప్రపంచంలో పాత తరం వారికి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి.. కొత్త తరం వారికి తాము ఎప్పుడూ చూడని ఆ కాలపు క్లాసిక్ లైఫ్ అనుభవించేందుకు.. ఈ టెక్నాలజీ ఒక చక్కని వేదికలాగా నిలిచింది. కాగా, ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా కూడా తమ 80ల కాలం నాటి ఫొటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.