Homeక్రీడలుక్రికెట్‌IND vs PAK: బుడ్డోడు ప్లాప్.. అభిషేక్ పాక్ ను ఎలాంటి దెబ్బ కొట్టాడంటే..గూస్ బంప్స్...

IND vs PAK: బుడ్డోడు ప్లాప్.. అభిషేక్ పాక్ ను ఎలాంటి దెబ్బ కొట్టాడంటే..గూస్ బంప్స్ వీడియో వైరల్

IND vs PAK: ఏషియన్ గేమ్స్ లో భాగంగా క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులు పాకిస్తాన్, భారత్ తలపడుతున్నాయి. హోరాహోరిగా సాగే అంచనాలు ఉన్న ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచే ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఈ కథనం రాసే సమయం వరకు మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్య వంశీ, అభిషేక్ శర్మ తొలి వికెట్ 28 పరుగులు మాత్రమే జోడించారు. […]

IND vs PAK: ఏషియన్ గేమ్స్ లో భాగంగా క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులు పాకిస్తాన్, భారత్ తలపడుతున్నాయి. హోరాహోరిగా సాగే అంచనాలు ఉన్న ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచే ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఈ కథనం రాసే సమయం వరకు మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

ఓపెనర్లు వైభవ్ సూర్య వంశీ, అభిషేక్ శర్మ తొలి వికెట్ 28 పరుగులు మాత్రమే జోడించారు. అయితే సూర్యవంశీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కున్న అతడు రెండు సిక్సర్లు కొట్టాడు. అదే జోరు చూపించ క్రమంలో ఆయుబ్ బౌలింగ్లో ఉస్మాన్ కు క్యాచ్ ఇచ్చాడు. మరో ఆటగాడు సంజు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి డేనియల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ దశలో అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లో మూడు ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు. ఏషియన్ గేమ్స్ లో ఇప్పటివరకు అభిషేక్ శర్మ తన సత్తా చూపించలేదు. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ మీద అదరగొట్టాడు. సంజు తో కలిసి రెండో వికెట్ కు 23.. కెప్టెన్ అయ్యర్ తో కలిసి మూడో వికెట్ కు 42 పరుగులు జోడించాడు.

అభిషేక్ శర్మ దూకుడు వల్ల టీమిండియా రికార్డు స్థాయిలో పరుగులు చేసింది. అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడు అనుకున్న క్రమంలో మినాస్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఈ దశలో అయ్యర్ (15*), కిషన్ (12*) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు ఇప్పటివరకు వీరిద్దరూ నాలుగో వికెట్ కు 14 బంతుల్లో 21 పరుగులు జోడించారు. స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తున్న మైదానంపై స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. చెత్త బంతులను బౌండరీ వైపు పంపిస్తున్నారు. ఇబ్బంది పెట్టే బంతులకు రెస్పెక్ట్ ఇస్తున్నారు.

టి20 వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్.. భారత్ పోటీ పడడం ఇదే తొలిసారి. అయితే ఈ మ్యాచ్లో సూర్య వంశీ మీద అందరికీ దృష్టి కేంద్రీకృతమై ఉంది. అయితే అతడు భారీ అంచనాల మధ్య రంగంలోకి దిగాడు. రెండు సిక్సర్లు కొట్టినప్పటికీ.. అదే జోరు కొనసాగించలేకపోయాడు. అందువల్లే టీమిండియా ప్రారంభ ఓవర్లలో భారీ స్కోరు చేయలేకపోయింది. ఒకవేళ సంజు గనుక నిలబడి ఉంటే భారత్ భారీ స్కోర్ చేయగలిగేది. వైభవ్ విఫలం కావడంతో సోషల్ మీడియాలో అతని మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బంగారం లాంటి అవకాశం వస్తే సరైన స్థాయిలో వినియోగించుకోలేక పోయావంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper