Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma fastest century: అభిషేక్ శర్మ సెంచరీకి బీజం పడింది అప్పుడే.. ఇందులో యువరాజ్...

Abhishek Sharma fastest century: అభిషేక్ శర్మ సెంచరీకి బీజం పడింది అప్పుడే.. ఇందులో యువరాజ్ పాత్ర ఏంటంటే..

Abhishek Sharma fastest century: ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ వేగవంతమైన సెంచరీ చేశాడు. కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.. 34 బంతులలో 9 ఫోర్లు.. 11 సిక్సర్లతో అతడు మొత్తంగా 108 పరుగులు చేశాడు. కేవలం బౌండరీల ద్వారానే అభిషేక్ శర్మ సెంచరీ చేయడం విశేషం. మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. మూడో […]

Abhishek Sharma fastest century: ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ వేగవంతమైన సెంచరీ చేశాడు. కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.. 34 బంతులలో 9 ఫోర్లు.. 11 సిక్సర్లతో అతడు మొత్తంగా 108 పరుగులు చేశాడు. కేవలం బౌండరీల ద్వారానే అభిషేక్ శర్మ సెంచరీ చేయడం విశేషం.

మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్ నామ మాత్రమే అయినప్పటికీ.. టీమిండియా దానిని అంత తేలికగా తీసుకోలేదు. మూడో మ్యాచ్ పై కూడా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. దీంతో టీమ్ ఇండియా ఏకంగా 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. సంజు శాంసన్ (50) హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. కెప్టెన్ అయ్యర్ (29) పర్వాలేదు అనిపించినప్పటికీ.. మిగతా ప్లేయర్లు తిలక్ వర్మ (2), శివం దుబే(14), ఇషాన్ కిషన్(10), నితీష్ కుమార్ రెడ్డి (1) దారుణంగా విఫలమయ్యారు. ఒక దశలో ఓవర్ కు 16 పరుగుల చొప్పున టీమిండియా స్కోర్ చేసింది. అదే జోరు గనుక చివరి వరకు కొనసాగిస్తే టీమిండియా కచ్చితంగా 300 పరుగుల మార్క్ చేరుకునేది. టి20 లలో సరికొత్త రికార్డు నెలకొల్పేది. కానీ ఆ ఘనతను టీమిండియా దూరం చేసుకుంది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల.. టీమ్ ఇండియా స్కోర్ కేవలం 221 పరుగుల వరకే ఆగిపోయింది.

అభిషేక్ సెంచరీ చేయడం వెనుక అతని గురువు యువరాజ్ సింగ్ ఉన్నాడు. గతంలో టి20 ఫార్మాట్ లో అభిషేక్ శర్మ అంతగా ఆకట్టుకునేవాడు కాదు. అయితేనేమో పరుగులు చేసేవాడు. లేకుంటే వరుసగా సున్నాలు పెట్టి వచ్చేవాడు. దీంతో అతని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అభిషేక్ లోపాల గురించి యువరాజ్ ప్రధానంగా దృష్టి పెట్టాడు. వాటిని ఎలా సవరించుకోవాలో వివరించాడు. ఫలితంగా అభిషేక్ మునుపటి ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ను తీసుకుంటే.. అతడు ఏకంగా హాఫ్ సెంచరీ.. సెంచరీ చేశాడు.. తొలి మ్యాచ్లో 82, రెండో మ్యాచ్లో 39, మూడో మ్యాచ్ లో 108.. మొత్తంగా 229 పరుగులు చేసి.. ఈ సిరీస్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

శిష్యుడిగా అభిషేక్ యువరాజు వద్ద క్రికెట్ లో ఓనమాలు దిద్దాడు. అతడిలాగే ఎడమ చేతి వాటం బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు మీద సరిగా 19 సంవత్సరాల క్రితం యువరాజ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు అతని శిష్యుడు అభిషేక్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper