IND vs PAK: సాధారణంగా మన వైభవ్ సూర్య వంశీ ఒక రకమైన టెంపో లో ఉంటాడు. తనని గెలికితే.. శివతాండవం చేస్తాడు.. 16 సంవత్సరాల బాలుడు అని చాలామంది ప్లేయర్లు అతడిని గేలి చేశారు. కానీ అతడి విశ్వరూపం చూసి చేతులెత్తి మొక్కారు. బాబోయ్ నీకో నమస్కారం అంటూ దండం పెట్టారు. ఎందుకంటే వైభవ్ సూర్య వంశీ కోపంతో ఆడితే బంతి పగిలిపోతుంది. బ్యాట్ విరిగిపోతుంది. బౌలర్ ముఖం మాడిపోతుంది.
అదృష్టం కొద్దీ శనివారం జరిగిన ఏషియన్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుకు తన అసలు రూపాన్ని చూపించలేకపోయాడు. కానీ అప్పటికే వైభవ్ సూర్య వంశీ రెండు సిక్సర్లు కొట్టాడు. దురదృష్టవశాత్తు సరిగా ఆడలేకపోయాడు. మూడవ ఓవర్ లోనే అవుట్ అయ్యాడు. పాకిస్తాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ చేస్తున్నప్పుడు రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు సూర్య వంశీ ప్రయత్నించాడు. కాకపోతే ఆ బంతి బ్యాట్ చివరి అంచుకు తగిలి గాలిలో లేచింది. దీంతో పాకిస్తాన్ ఫీల్డర్ ఆ బంతిని అందుకున్నారు.
సూర్య వంశీ మైదానం నుంచి బయటికి వెళ్తున్న సమయంలో.. పాకిస్తాన్ ఆటగాడు అతడిని చూసి సైగ చేశాడు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి.. నా బౌలింగ్ నువ్వు ఆడ లేవు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. సూర్య వంశీ మైదానం నుంచి బయటికి వెళ్తుండగా.. ప్రేక్షకుల్లో ఒక రకమైన గంభీరమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే సూర్యవంశీ మాట అంటే పడేరకం కాదు. పైగా గట్టిగా రివెంజ్ తీర్చుకునే స్థాయి అతడిది. గతంలో శ్రీలంక ప్లేయర్లకు.. అంతకుముందు ఐపీఎల్లో కొన్ని జట్లకు తన అసలు రూపం ఎలా ఉంటుందో చూపించాడు. కాబట్టి అతనితో గెలుక్కోవడానికి.. అతడిని గెలకడానికి ఏ ప్లేయర్లు కూడా ముందుకు రారు.
అయితే పాకిస్తాన్ ప్లేయర్ల విషయంలో మాత్రం సూర్య వంశీ నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడి బాధ్యతను అభిషేక్ శర్మ భుజాలకు ఎత్తుకున్నాడు. ఆ తర్వాత బౌలింగ్లో అభిషేక్ శర్మ వరుసగా బౌండరీలు కొట్టాడు. ఏకంగా హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేస్తాడనుకుంటున్న క్రమంలో దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు గనుక నిలబడి ఉంటే.. పాకిస్తాన్ జట్టుకు చుక్కలు కనిపించేవి. సూర్యవంశీ అలా అవుట్ కావడంతో భారత్ స్కోరు ఆశించిన స్థాయిలో చేయలేకపోయింది. కాకపోతే అభిషేక్ శర్మ సూర్య వంశీ లేని లోటును భర్తీ చేశాడు. ప్రస్తుతం టీమిండియా ఈ కథనం రాసే సమయం వరకు 15.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది..
HEATED ARGUMENT BETWEEN VAIBHAV SOORYAVANSHI & SAIM AYUB
In the third over, when Pakistani bowler Shaheen Afridi came on to bowl to Vaibhav Suryavanshi, Vaibhav attempted a reverse shot but got caught and was dismissed.
As Vaibhav was walking off, Saim gestured toward him… pic.twitter.com/214KBZYA2l
— lndian Sports Network (@IS_Netwrk29) October 3, 2026