IND vs AFG: అభిషేక్ ఫామ్ లో ఉంటే ఎంతటి బౌలర్ అయిన సరే మూసుకోవాల్సిందే. ఆస్ట్రేలియా నుంచి ఆఫ్గనిస్తాన్ వరకు ఇదే స్టోరీ. తనదైన రోజున విధ్వంసం కాదు అంతకు మించిన స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడు. బంతిని పగిలే దాకా కొడతాడు. అంతేకాదు మైదానం నలుమూలల పరుగులు పెట్టిస్తాడు.
గురువారం ఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ తన ఉగ్రరూపాన్ని చూపించాడు. కేవలం 30 బంతుల్లో సెంచరీ చేశాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. మిగతా 50 పరుగులు చేయడానికి కేవలం 14 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. అతడి ఇన్నింగ్స్ ఒక విస్ఫోటనం లాగా సాగింది. బంతిమీద పగ ఉన్నట్టుగా అతడు బ్యాటింగ్ చేశాడు. మైదానం నలుమూలల బంతిని పరుగులు పెట్టించాడు.
33 బంతుల్లో 9 ఫోర్లు.. 11 సిక్సర్లతో అభిషేక్ శర్మ ఏకంగా 108 పరుగులు చేశాడు. అంతేకాదు, అతడి స్ట్రైట్ రేటు 327. 27 గా నమోదయింది. తొలి వికెట్ కు సంజు శాంసన్ తో కలిసి ఏకంగా 58 బంతుల్లో 142 పరుగులు జోడించాడు అభిషేక్.
సెంచరీ పూర్తి చేసిన తర్వాత సహజంగా అయితే రెండు చేతి వేళ్లను ఆకాశం వైపు చూపించి.. అభిమానులకు అభివాదం చేస్తాడు అభిషేక్ శర్మ. కానీ ఈసారి అలా కాకుండా యోగాసనం వేశాడు. దీని వెనక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం. ఆయనకు యోగాసనం వేసి.. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు అభిషేక్ శర్మ. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాతనే యోగాకు ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఏకంగా ఐక్యరాజ్యసమితి యోగా దినోత్సవం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే లెవెల్ కి యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకెళ్లారు. ఆయన జన్మదినం సందర్భంగా యోగాసనం వేసి ఈ విధంగా అభిషేక్ శర్మ శుభాకాంక్షలు తెలియజేశాడు. అన్నట్టు ఈ సిరీస్లో ఇప్పటికే ఒక హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ.. తాజా సెంచరీ ద్వారా హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
108 పరుగులు చేసిన అభిషేక్ శర్మ చివరికి రషీద్ ఖాన్ బౌలింగ్లో గుర్బాజ్ పట్టిన క్యాచ్ ద్వారా వెనక్కి వెళ్లిపోయాడు. సంజు తో కలిసి అతడు తొలి వికెట్ కు ఏకంగా 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అది కూడా కేవలం 9.5 ఓవర్లలో మాత్రమే కావడం విశేషం.
100 OFF JUST 30 BALLS
TAKE A BOW, ABHISHEK SHARMA #AFGvIND pic.twitter.com/q6wdayHGiz
— FanCode (@FanCode) September 17, 2026