Shai Hope: లారాలాగా దూకుడుగా ఆడతాడు. సామీ లాగా అప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో విఫలమవుతాడు. కానీ మెజారిటీస్ సందర్భాలలో మాత్రం నిలబడతాడు. నాయకుడిగా ఆడతాడు. ఆటగాడిగా ఆడతాడు. ఇక్కడ పాత్రలు మాత్రమే మారుతాయి. అతని ఆట తీరు ఏమాత్రం మారదు. అందువల్లే మూడో వన్డేలో టీమిండియా 352 పరుగుల విజయ లక్ష్యాన్ని కళ్ళ ముందు ఉంచినప్పటికీ.. 40 ఓవర్ల దాకా ఏమాత్రం ఆశలు లేనప్పటికీ.. కలబడి.. నిలబడి.. టీమ్ ఇండియా ను ఓడించాడు వెస్టిండీస్ సారథి షై హోప్.
భారత జట్టుపై విజయం సాధించాలంటే 352 పరుగులు చేయాలి. అది కూడా వారి సొంత మైదానంపై. తొలి రెండు వందల లో ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. పైగా సిరీస్ కూడా చేజారిపోయింది. ఇలాంటి సమయంలో జట్లు మ్యాచ్ కాపాడుకోవడం మీదనే దృష్టిపెడతాయి. కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోప్ మాత్రం మరో విధంగా ఆలోచించాడు. బ్యాట్ తో జట్టను ముందుండి నడిపించాడు. చివరి వరకు నిలబడి టీమ్ ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చాడు.
ముల్లాన్ పూర్ ప్రాంతంలో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 352/5 పరుగులు చేసి.. భారత జట్టు మీద తిరుగులేని విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ సెక్స్ ఇది అత్యధిక విజయవంతమైన చేజింగ్. భారత్ 351 పరుగుల స్కోర్ చేసింది. రాహుల్ అజయ్యంగా 129 పరుగులు చేశాడు. హోప్ ఇలా ఆడటం కొత్త కాకపోయినప్పటికీ.. జట్టు పరిస్థితి అంచనా వేసి అతడు ఆడాడు. మొదటినుంచి భారీ షాట్లు ఆడలేదు. చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. జట్టుకు అవసరమైన సమయంలో బౌండరీలు సాధించాడు. జట్టుకు అవసరమైన సమయంలో భాగస్వామ్యాలు నిర్మించాడు.
50 ఓవర్ల పాటు కీపింగ్ చేశాడు. 48.2 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉన్నాడు.. అంటే ఇది కేవలం అతని బ్యాటింగ్ ప్రదర్శన మాత్రమే కాదు. శారీరక.. మానసిక పట్టుదలకు నిదర్శనం. మ్యాచ్ అనంతరం హోప్ తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తో జరిగిన సంభాషణ తనకు ఉపయోగపడిందని చెప్పాడు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో చివరి ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని.. చేయాల్సిన దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలని ధోని ఇచ్చిన సలహాలు గుర్తు చేసుకున్నట్టు అతడు పేర్కొన్నాడు.
పరిస్థితులను ముందుగానే అంచనా వేసి.. చివరి ఓవర్ లో ఫీల్డింగ్ పరిమితులను కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. హోప్ సాధించిన సెంచరీ ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే చేజింగ్ లో వెస్టిండీస్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు లారా పేరు మీద ఉన్నది. 1993లో పాకిస్తాన్ మీద 153 పరుగులను లారా చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును 162 పరుగులతో హోప్ అధిగమించాడు. అంటే 33 ఏళ్ల నాటి లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విజయం వెస్టిండీస్ జట్టుకు సిరీస్ అందించలేదు.. కాకపోతే త్వరలో మొదలయ్యే టి20 సిరీస్ లో వెస్టిండీస్ జట్టుకు బ్రహ్మాండమైన బలాన్ని అందించింది.
Shai Hope: “A simple piece of advice from a very famous person MS Dhoni changed my ODI career completely.”
Thala Dhoni effect is real https://t.co/N6M0iRJlSL
— Zenith. (@Msdcore7) October 3, 2026