Motorola: కొంతకాలంగా మోటరోలా కంపెనీ భారత మార్కెట్ మీద తీవ్రంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకొని మోటరోలా ఈ మోడల్స్ రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలు గీక్ బెంచ్ ద్వారా బయటికి వచ్చాయి.. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
గీక్ బెంచ్ నిర్వహించిన పరీక్షలలో
గీక్ బెంచ్ నిర్వహించిన పరీక్షలలో భాగంగా మోటరోలా ఎడ్జ్ 70 నియో అనే మోడల్ ను తీసుకొస్తోంది. ఈ ఫోన్లో qualcom Snapdragon 7 S Gen(ఇది మార్కెటింగ్ పేరు, చిప్ సెట్ కోడ్ QTI SM 7635) ప్రాసెసర్ ఇందులో ఉంది. మోటోరోలా కంపెనీ ఇదే చిప్ ను ఎడ్జ్ 70 ప్లస్ లో కూడా అమర్చింది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది గ్లాబల్ వెర్షన్ కు రీ బ్రాండెడ్ వేరియంట్ అని విశ్లేషకులు అంటున్నారు.
సాధారణ వాడకానికి ఇది అద్భుతం
గీక్ బెంచ్ నిర్వహించిన పరీక్షలో సింగిల్ కోర్ లో 723 పాయింట్లు.. మల్టీ కోర్ లో 2,943 పాయింట్లు వచ్చాయి. ఆల్ట కోర్ ప్రాసెసర్ లో నాలుగు కోర్లు, 1.80 GHz, 1 ప్రైమ్ కోర్, 2.5O GHz క్లాక్ స్పీడ్ ద్వారా ఇవి పనిచేస్తాయి. గ్రాఫిక్స్ విషయంలో కూడా మోటరోలా ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఇందులో అడ్రెనో 810 జిపియు ఏర్పాటు చేసింది. ఈ ఫోన్ 6 GB రామ్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది. గేమింగ్ విషయాన్ని పక్కన పెడితే.. సాధారణ వాడకానికి ఇది అద్భుతంగా సరిపోతుంది. కాకపోతే ఇది మిడ్ రేంజ్ చిప్ లాగా ఉంది.
డిజైన్ విషయంలో..
డిజైన్ విషయంలో ఇది దాదాపు 6.3 అంగుళాల కాంపాక్ట్ డిస్ ప్లే ను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా మార్కెట్లోకి వచ్చే తొలి ఫ్రీ లోడెడ్ మోటరోలా ఫోన్ ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ఫోన్ పింక్.. డార్క్ గ్రీన్.. లైట్ వైట్.. లైట్ బ్లూ అనే రంగుల్లో లభిస్తుంది. ఫోన్ వెనక 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. డిస్ ప్లే, బ్యాటరీ.. ఇంకా మిగతా వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కస్టమర్లు కోరుకునే ధరల ప్రకారం చూసుకుంటే ఇది 2500 ఈఎంఐ ఆప్షన్ ద్వారా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. స్టైల్ కోరుకునే వాళ్లకు.. బడ్జెట్ ధర కోరుకునే వాళ్లకు ఈ ఫోన్ ఎంపిక అత్యుత్తమమని టెక్ నిపుణులు చెబుతున్నారు.