Homeక్రీడలుTeam India : టీమిండియా పై చేతబడి చేశారా.. పదిమంది ప్లేయర్లు జట్టుకు దూరం.. ఏం...

Team India : టీమిండియా పై చేతబడి చేశారా.. పదిమంది ప్లేయర్లు జట్టుకు దూరం.. ఏం జరుగుతోంది..

Team India : ప్రపంచ ప్రఖ్యాత స్థాయిలో సౌకర్యాలు.. అద్భుతమైన శిక్షణ బృందం.. డబ్బుకు కొదవలేదు. దేన్నైనా సరే చిటికెలో తీసుకొచ్చే మేనేజ్మెంట్.. ఇన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నప్పటికీ టీమ్ ఇండియా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఒకప్పుడు టీమిండియా మ్యాచ్ ఆడుతోంది అంటే కచ్చితంగా అగ్రశ్రేణి ప్లేయర్లు అందుబాటులో ఉండేవారు. వారు ఏడాది పొడవునా క్రికెట్ ఆడుతూనే ఉండేవారు. ఎప్పుడో ఒకసారి గాయాల బారిన పడుతూ ఉండేవారు. ఆరోగ్యానికి కాపాడుకునేవారు. జట్టుకు విలువైన ఇన్నింగ్స్ ఆడేవారు. తద్వారా […]

Team India : ప్రపంచ ప్రఖ్యాత స్థాయిలో సౌకర్యాలు.. అద్భుతమైన శిక్షణ బృందం.. డబ్బుకు కొదవలేదు. దేన్నైనా సరే చిటికెలో తీసుకొచ్చే మేనేజ్మెంట్.. ఇన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నప్పటికీ టీమ్ ఇండియా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.

ఒకప్పుడు టీమిండియా మ్యాచ్ ఆడుతోంది అంటే కచ్చితంగా అగ్రశ్రేణి ప్లేయర్లు అందుబాటులో ఉండేవారు. వారు ఏడాది పొడవునా క్రికెట్ ఆడుతూనే ఉండేవారు. ఎప్పుడో ఒకసారి గాయాల బారిన పడుతూ ఉండేవారు. ఆరోగ్యానికి కాపాడుకునేవారు. జట్టుకు విలువైన ఇన్నింగ్స్ ఆడేవారు. తద్వారా జట్టు సాధించిన విజయాలలో ముఖ్య భూమిక పోషించేవారు. ఇప్పటి తరం ప్లేయర్ల మీద ఒత్తిడి అధికంగా ఉంది. మ్యాచ్లు ఆడే సంఖ్య పెరిగిపోతుంది. దీనికి తోడు ఐపిఎల్.. ఇవన్నీ కూడా ఆటగాళ్ల శారీరక సామర్థ్యం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

టీమిండియాలో ప్లేయర్లకు అద్భుతమైన ఫిట్నెస్ ఉంటుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. పైగా మన ప్లేయర్లు శరీరాన్ని కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అయితే స్థాయికి మించిన ఆట తీరు.. విపరీతమైన ఒత్తిడి.. షెడ్యూల్ వల్ల ప్లేయర్లు ఇబ్బంది పడుతున్నారు. గాయాల బారిన పడుతున్నారు. ఇది అంతిమంగా జట్టు విజయాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అగ్రశ్రేణి ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో ద్వితీయ శ్రేణి ప్లేయర్లతో మ్యాచులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల జట్టు విజయాలు సాధించక.. దారుణమైన ఓటములను ఎదుర్కొంటున్నది.

ప్రస్తుతం టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. శ్రీలంక జట్టుతో రెండు టెస్టులు ఆడబోతోంది. అయితే ఈ సిరీస్ కు కీలకమైన ప్లేయర్లు దూరం కావడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. టీ మీడియాలో దాదాపు పదిమంది ప్లేయర్లు గాయాల బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా, సుదర్శన్.. హర్షిత్.. నితీష్.. సుందర్.. వరుణ్ చక్రవర్తి.. ప్రిన్స్ యాదవ్.. అశోక్ వంటి ప్లేయర్లు గాయాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

వాస్తవానికి టీం ఇండియా కొంతకాలం క్రితం అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. పైగా చాంపియన్స్ ట్రోఫీ.. టి20 వరల్డ్ కప్.. ఆసియా కప్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీలను గెలుచుకుంది. టీమిండియా అగ్ర పదంలో దూసుకుపోతున్న నేపథ్యంలో గిట్టని వ్యక్తులు ఏమైనా చేతబడి చేశారేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నేటి కాలంలో చేతబడి లాంటి వ్యవహారాలు లేకపోయినప్పటికీ.. టీమిండియా మీద ఉన్న వల్ల మారిన అభిమానంతో చాలామంది అభిమానులు ఇతరహాలు కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు ఈ తీరుగా గాయాల బారిన పడిన నేపథ్యంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ హెడ్ లక్ష్మణ్.. బోర్డు సెక్రటరీ దేవదత్.. రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న లోపాలను.. ఇతర వ్యవహారాలను సవరించే పని చేస్తున్నట్టు సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper