Homeక్రీడలుVaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీ లో ఈ యాంగిల్ కూడా ఉందా..భలే సర్ప్రైజ్...

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీ లో ఈ యాంగిల్ కూడా ఉందా..భలే సర్ప్రైజ్ ఇచ్చాడుగా..

Vaibhav Suryavanshi : బంతి కనిపిస్తే చాలు బలంగా కొట్టడమే అతడికి తెలుసు. అయితే ఫోర్ లేకుంటే సిక్సర్.. అదే అతనికి తెలిసింది. అందువల్లే ఈ కాలపు బాహుబలి మాదిరిగా అతడు ఆడుతున్నాడు. ఇప్పటికే అతడు అనేకమంది ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంకా అతడికి ఎంతో కెరీయర్ ఉంది. ఎంతో భవిష్యత్తు ఉంది.. ఈ ప్రకారం చూసుకుంటే ఎన్నో రికార్డులు అతడు పాదాక్రాంతం అయ్యే అవకాశం ఉంది. ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది.. మేము చెబుతున్నది […]

Vaibhav Suryavanshi : బంతి కనిపిస్తే చాలు బలంగా కొట్టడమే అతడికి తెలుసు. అయితే ఫోర్ లేకుంటే సిక్సర్.. అదే అతనికి తెలిసింది. అందువల్లే ఈ కాలపు బాహుబలి మాదిరిగా అతడు ఆడుతున్నాడు. ఇప్పటికే అతడు అనేకమంది ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంకా అతడికి ఎంతో కెరీయర్ ఉంది. ఎంతో భవిష్యత్తు ఉంది.. ఈ ప్రకారం చూసుకుంటే ఎన్నో రికార్డులు అతడు పాదాక్రాంతం అయ్యే అవకాశం ఉంది. ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది.. మేము చెబుతున్నది చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ గురించి అని.

సూర్యవంశీ ఇప్పటివరకు ఐపిఎల్ లో అదరగొట్టాడు. టీమిండియాలో కూడా సత్తా చూపించాడు. అతడు కొత్తగా నిరూపించుకోవడానికి చాలా ఉన్నాయి. కాకపోతే వచ్చిన అవకాశాలను అతడు బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. చివరికి డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు సూర్యవంశీ కేవలం బ్యాట్ ద్వారా మాత్రమే ఆకట్టుకున్నాడు. ఫీల్డింగ్ లో కూడా మెరుపులు మెరిపించాడు. అయితే అతడిలో కనిపించని మరో కోణం కూడా ఉంది. దానిని మొత్తానికి బయటపెట్టేశాడు. దీంతో తోటి ప్లేయర్లకు.. ప్రత్యర్థి ఆటగాళ్లకు.. మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు.. టీవీలలో మ్యాచ్ వీక్షిస్తున్న వీక్షకులకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది.

భీకరమైన ఆట తీరుతో ఆకట్టుకునే యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కొత్త టాలెంట్ బయటికి తీయడంతో అందరూ ఫీదా అవుతున్నారు. దిలీప్ ట్రోఫీలో భాగంగా అతడు నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. ఈస్ట్ జోన్ జట్టు తరపున స్పిన్ బౌలింగ్ వేసాడు. కేవలం 1.5 బంతుల్లోనే రెండు వికెట్లు తీశాడు. ప్రతిబంతిని వైవిద్యంగా వేశాడు.. ఆ బంతులను తట్టుకోలేక ప్రత్యర్థి ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. అతని బౌలింగ్ వేగంగా ఉంది. అదే సమయంలో విభిన్నంగా ఉంది. అందువల్లే పరుగులు తీయడం కాదు కదా.. వికెట్లు కాపాడుకోవడమే కష్టంగా మారింది.

“బేబీ బాస్ బౌలింగ్ అదిరింది. అతడు వేసే ప్రతి బంతి కొత్తగా ఉంది. అతడు తన నైపుణ్యానికి మరింత పదును పెట్టుకుంటే తిరిగి ఉండదు. అతడు గొప్పగా ఆడాలి. అన్నిటికంటే ముఖ్యంగా బౌలింగ్లో మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అదే గనుక జరిగితే టీమిండియా ఒక గొప్ప ఆటగాడిని సొంతం చేసుకున్నట్టు అవుతుంది. గతంలో చాలామంది ప్లేయర్లు ఇలా అన్ని రకాల నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇతడు కూడా చేరిపోతున్నాడు. టీం ఇండియాకు ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు అంటూ”అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper