IND vs AFG: సేమ్ సేమ్.. అదే ఫలితం.. వేదిక మారలేదు. ఆఫ్ఘనిస్తాన్ ఆట తీరు మారలేదు. భారత్ మాత్రం రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అచ్చం తొలి మ్యాచ్లో ఫలితం మాదిరిగానే.. రెండో మ్యాచ్లో కూడా ఫలితాన్ని అందుకుంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది.
ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది.. కెప్టెన్ ఇబ్రహీం 37, రషీద్ ఖాన్ 28 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమ్ ఇండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి.. 14.5 ఓవర్లలోనే విజయాన్ని దక్కించుకుంది. సంజు 57 పరుగులతో అదరగొట్టాడు. అభిషేక్ 39 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఇషాన్ కిషన్ 38* పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు.
అనేక రికార్డులు బద్దలు కొట్టింది
ఈ విజయం ద్వారా టీమిండియా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. 2010 నుంచి ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ మీద టీమిండియా ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. మొత్తంగా 10 మ్యాచ్లను ఏకపక్షంగా టీమ్ ఇండియా గెలిచింది. 2019 నుంచి 2025 వరకు బంగ్లాదేశ్ మీద టీమిండియా వరుసగా 9 మ్యాచ్లలో విజయాలు సాధించింది. తాజా సిరీస్ విజయం ద్వారా బంగ్లా మీద ఉన్న రికార్డ్ రెండవ స్థానానికి పడిపోయింది. ఇక 2024 నుంచి 2026 వరకు జింబాబ్వే మీద టీం ఇండియా వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది. 2009 నుంచి 2018 వరకు బంగ్లాదేశ్ మీద వరుసగా ఎనిమిది విజయాలు దక్కించుకుంది. 2009 నుంచి 2024 వరకు ఐర్లాండ్ మీద వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది.. మరో 38 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా.. టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టి20 క్రికెట్ చరిత్రలో ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించిన జట్టుగా టీమిండియా రెండవ స్థానంలో ఉంది.
ఇషాన్ అదరహో
ఇక ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సూర్య కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉన్నాడు. 2022లో సూర్య కుమార్ యాదవ్ 187.43 స్ట్రైక్ రేటు తో 1,164 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ ఈ ఏడాది 173.2 స్ట్రైక్ రేట్ తో 892 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 2025లో 193.46 స్ట్రైక్ రేటుతో 859 పరుగులు చేశాడు. 2022లో విరాట్ కోహ్లీ 138.23 స్ట్రైక్ రేట్ తో 781 పరుగులు చేశాడు. 2023లో సూర్య కుమార్ యాదవ్ 155.95 స్ట్రైక్ రేట్ తో 733 పరుగులు చేశాడు. ఇక 2024 t20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఒకటి నుంచి ఆరు ఓవర్ల మధ్యలో 75 పరుగులకు మించిన స్కోరు ను 9 సార్లు నమోదు చేసింది. న్యూజిలాండ్ ఐదుసార్లు.. ఇంగ్లాండ్, జింబాబ్వే నాలుగుసార్లు, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ రెండుసార్లు, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, నమిబియా, నెదర్లాండ్స్ ఒకసారి ఈ ఘనతను అందుకున్నాయి.
– Sanju Samson scored 57 runs.
– 52 runs came through boundaries.Total madness from the T20 World Cup hero pic.twitter.com/P3Pgl1suNI
— Johns. (@CricCrazyJohns) September 15, 2026