Dinesh Karthik: వైట్ బాల్ ఫార్మాట్ లో టీం ఇండియా ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. టీమిండియా వన్డే ర్యాంకింగ్స్ విషయంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
2027 వన్డే వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలని టీమిండియా బలంగా నిర్ణయించుకుంది. అందువల్లే జట్టు విషయంలో.. ఆటగాళ్ల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. 2027 వన్డే వరల్డ్ కప్ జరగడానికి ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. బ్యాటింగ్.. బౌలింగ్ కోచ్ ల పదవి కాలం ముగిసిన తర్వాత.. కొత్త వాళ్లను నియమించుకుంది. పాత వాళ్లకు ఏమాత్రం పొడిగింపు అవకాశం ఇవ్వలేదు.
జట్టులో ఆటగాళ్ల విషయంలో కూడా మేనేజ్మెంట్ అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నది. సరిగ్గా ఆడలేని ప్లేయర్లను పక్కన పెడుతున్నది. సరిగ్గా ఆడుతున్న ప్లేయర్లకు విస్తృతంగా అవకాశాలు ఇస్తున్నది. జట్టుకు పనికి వస్తారు అనుకునే ప్లేయర్లకు బెంగళూరులో శిక్షణ ఇస్తున్నది. మొత్తానికి బృహత్ ప్రణాళికతో టీమిండియా మేనేజ్మెంట్ బలమైన అడుగులు వేస్తోంది.
వచ్చే వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుంది. అక్కడి మైదానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వికెట్లకు అనుకూలిస్తాయి. అదే సమయంలో పరుగుల వరద సాగడానికి దోహదం చేస్తాయి. ఇటువంటి మైదానాల మీద ఎటువంటి ఆటగాళ్లు ఉంటే టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందో మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ చెప్పాడు.
ఇటీవల అతడు ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా వేదిక జరుగుతుంది కాబట్టి.. కచ్చితంగా ప్లేయర్ల ఎంపికలో మేనేజ్మెంట్ జాగ్రత్త వహించాలని సూచించాడు. దక్షిణాఫ్రికా గడ్డమీద అద్భుతమైన రికార్డు ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని.. ఒకవేళ ఆ ప్లేయర్ల ఆట తీరు సరిగా లేకపోతే.. శిక్షణ ఇచ్చి మెరుగుపరచాలని సూచించాడు. జట్టుకు నాయకుడిగా గిల్ ఉండాలని.. జట్టులో రోకో లేకుండా వరల్డ్ కప్ అసాధ్యమని కార్తీక్ స్పష్టం చేశాడు. అయ్యర్.. రాహుల్.. పాండ్యా.. కులదీప్.. బుమ్రా.. సిరాజ్.. శమీ.. కిషన్.. జైస్వాల్.. భువనేశ్వర్.. నితీష్ వంటి ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తే టీమిండియాకు ఎదురు అనేది ఉండదని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇతని అభిప్రాయంతో మెజారిటీ అభిమానులు మాత్రమే కాదు.. మాజీ ప్లేయర్లు కూడా ఏకీభవిస్తున్నారు.