HomeNewsShubman Gill: గిల్ డబుల్ సెంచరీ.. వెస్టిండీస్ అస్సామే

Shubman Gill: గిల్ డబుల్ సెంచరీ.. వెస్టిండీస్ అస్సామే

Shubman Gill: టీమ్ ఇండియా యంగ్ కెప్టెన్ గిల్ అదరగొట్టాడు.. సూపర్ డబుల్ సెంచరీ తో టీమ్ ఇండియా అభిమానులకు తిరుగులేని క్రికెట్ మజా అందించాడు. గౌహతి వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ 121 బంతుల్లో 203 పరుగులు చేశాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. 24 ఫోర్లు.. ఏడు సిక్సర్లతో తుఫాను స్థాయి ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (101) తో […]

Shubman Gill: టీమ్ ఇండియా యంగ్ కెప్టెన్ గిల్ అదరగొట్టాడు.. సూపర్ డబుల్ సెంచరీ తో టీమ్ ఇండియా అభిమానులకు తిరుగులేని క్రికెట్ మజా అందించాడు. గౌహతి వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ 121 బంతుల్లో 203 పరుగులు చేశాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. 24 ఫోర్లు.. ఏడు సిక్సర్లతో తుఫాను స్థాయి ఇన్నింగ్స్ ఆడాడు.

మరో ఓపెనర్ రోహిత్ శర్మ (101) తో కలిసి తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో 255 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు 65 పరుగులు జోడించాడు. మూడో వికెట్ ఋతురాజు గైక్వాడ్ తో కలిసి 52* పరుగులు జోడించాడు. విరాట్ కోహ్లీ (29) విఫలమైనప్పటికీ.. సెంచరీ చేసిన రోహిత్ ఆ తర్వాత అవుట్ అయినప్పటికీ.. కొండంత లక్ష్యాన్ని చేదించే క్రమంలో గిల్ తన మాస్టర్ క్లాస్ చూపించాడు. వెస్టిండీస్ బౌలర్లను ఒక ఆట ఆడుతున్నాడు. వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని ఏ దశలో కూడా విడవకుండా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ ఒక దశలో ఇబ్బంది పడినప్పటికీ.. గిల్ మాత్రం తిరుగు లేని సామర్థ్యాన్ని చూపించాడు. ఎక్కడా తడబడకుండా.. వెస్టిండీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు. తద్వారా తాను ఎంత స్పెషలో వెస్టిండీస్ బౌలర్లకు మరోసారి నిరూపించాడు.

  • ఈ డబుల్ సెంచరీ ద్వారా గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. చేజింగ్లో హైయెస్ట్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
  • గిల్ తర్వాత స్థానంలో మ్యాక్స్వెల్ కొనసాగుతున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద మ్యాక్స్వెల్ 201 పరుగులు చేశాడు.
  • 2021లో పాకిస్తాన్ ఆటగాడు ఫకర్ జమాన్ సౌత్ ఆఫ్రికా మీద 193 పరుగులు చేశాడు.
  • 2011లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాడు వాట్సన్ 185* పరుగులు చేశాడు.
  • 2005లో జైపూర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని 183* పరుగులు చేశాడు.
  • 2012లో మీర్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు.
  • డబుల్ సెంచరీ చేయడం గిల్ కు ఇది రెండవసారి. మొత్తంగా 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు..
  • గిల్ తర్వాత స్థానంలో ఇషాన్ కిషన్ కొనసాగుతున్నాడు. ఇతడు 126 బంతుల్లో బంగ్లాదేశ్ జట్టు మీద 2022లో డబుల్ సెంచరీ చేశాడు.
  • 2023లో ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద మ్యాక్స్వెల్ 128 బంతులలో డబుల్ సెంచరీ చేశాడు.
  • 2024 లో శ్రీలంక ఆటగాడు నిశాంక ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 136 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.
  • 2017లో క్యాంబెర్ర వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే జట్టు మీద గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

కాగా, గిల్ 2023లో న్యూజిలాండ్ జట్టు మీద హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో డబల్ సెంచరీ చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper