SS Rajamouli: ఎంతటి వాడైనా పెళ్ళాం ముందు తలవంచాల్సిందే అని పెద్దలు అంటూ ఉంటారు. రీసెంట్ గా రాజమౌళి, రమా రాజమౌళి దంపతుల మధ్య జరిగిన ఒక చిలిపి సన్నివేశానికి సంబంధించిన వీడియో ని చూస్తే పెద్దలు చెప్పింది నిజమేనని అనిపిస్తాది. హాలీవుడ్ ఆడియన్స్ ని సైతం తన టాలెంట్ తో అబ్బురపరిచిన రాజమౌళి తన సతీమణి ముందు ఒక సాధారణమైన వాడే అని అనిపించుకున్న సంఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రీసెంట్ గానే నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథి గా విచ్చేసిన సంగతి తెలిసిందే.
అయితే రాజమౌళి స్టేజి మీదకు వస్తున్నప్పుడు , ఆయన సతీమణి రమా ‘పదా ముందుకు’ అంటూ రాజమౌళి పై చిరాకు పడుతూ ముందుకు నెట్టడం చాలా ఫన్నీ గా అనిపించింది. ఈ వీడియో ని చూసిన తర్వాత నెటిజెన్స్ సోషల్ మీడియా లో రాజమౌళి పై అనేక ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. షూటింగ్ సెట్స్ లో పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ని సైతం పర్ఫెక్షన్ పేరుతో టార్చర్ పెట్టే రాజమౌళి ని , ఆయన సతీమణి ఇలా డిమాండ్ చేస్తుంటే చూసేందుకు చాలా ముచ్చటగా ఉందని, వీళ్ళ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ విషయానికి వస్తే , ఈ చిత్రం లో హీరో గా ఫహద్ ఫాజిల్ నటించాడు. ‘పుష్ప’ సిరీస్ తర్వాత ఆయన చేసిన డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అంచనాలు మంచిగానే ఉన్నాయి.
నేడు హైదరాబాద్ లోని కొన్ని సెలెక్టెడ్ టాప్ థియేటర్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ ని కూడా ప్రదర్శిస్తున్నారు మేకర్స్. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్ వచ్చింది. పైగా జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరు కావడం తో , ఈ సినిమాకు రీచ్ కూడా భారీ రేంజ్ లో వచ్చిందని, కాస్త యావరేజ్ రేంజ్ టాక్ వచ్చినా , ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.