IND vs WI: చిన్నప్పుడు మన పుస్తకాల్లో న్యూటన్ సిద్ధాంతాల గురించి చదువుకుని ఉంటాం. అందులో పైకి విసిరిన ఆపిల్ పండు కిందికి ఎందుకు వస్తుందో న్యూటన్ కు ఆశ్చర్యంగా అనిపించింది. అది కాస్త భౌతిక శాస్త్రాన్ని సరికొత్త దిశగా అడుగులు వేయించింది. గురుత్వ ఆకర్షణ శక్తి అనేది ఉందని న్యూటన్ కు తెలిసింది. ఆ తర్వాత ప్రపంచ సైన్స్ గతి పూర్తిగా మారిపోయింది.
న్యూటన్ కనక ఇప్పుడు బతికి ఉంటే కచ్చితంగా భూమి ఆకర్షణ శక్తి సరికొత్తగా ఉంటుందని చూపించేవాడు. ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ అలా సాగిపోతుంది కాబట్టి. బంతి ఎలా వేసినా సరే.. ఎక్కడ వేసినా సరే రోహిత్ కొడుతున్నాడు. ఇక్కడ రోహిత్ కొట్టడం కామన్ కాదు.. బంతి ఆకాశంలోకి ఎగరడం కామన్. సరికొత్త రికార్డులను సృష్టించే విధంగా రోహిత్ బ్యాటింగ్ చేశాడు. ఈ కథనం రాసే సమయం వరకు రోహిత్ 47 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు.. ఐదు సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 144.68 కొనసాగుతోంది.
మామూలుగానే బంతులను స్టాండ్స్ అవతలికి పంపించడానికి రోహిత్ విపరీతమైన ఆసక్తిని చూపిస్తుంటాడు. అంతేకాదు తాజాగా జరుగుతున్న మ్యాచ్లో అదే జోరుని చూపించాడు. మొత్తంగా వన్డే వరల్డ్ కప్ లో తన స్థానం గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తన స్థాయి బ్యాటింగ్ ఎలా ఉంటుందో తనను విమర్శిస్తున్న వారికి బారాబర్ చూపించాడు. తొలి మ్యాచ్లో తన స్థాయి ఆట తీరు చూపించలేకపోయినప్పటికీ.. రెండో మ్యాచ్ జరుగుతున్న గౌహతిలో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో రంగంలోకి దిగిన రోహిత్ శర్మ కెప్టెన్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు కేవలం 14 ఓవర్లలోనే 121 పరుగులు జోడించాడు. గిల్ 47* పరుగులు చేశాడు. అతడు కూడా హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. పైగా వీరిద్దరూ తొలి వికెట్ కు 84 బంతుల్లో 121 పరుగులు చేశారు. వీరిద్దరూ చివరి 10 ఓవర్లలో 8.9 రన్ రేట్ తో 89 పరుగులు చేయడం విశేషం.
తాజా హాఫ్ సెంచరీ ద్వారా రోహిత్ సరికొత్త రికార్డులు సృష్టించాడు. సిక్సర్లపరంగా వెస్టిండీస్ మీద అతడు 41* సిక్సర్లు నమోదు చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మనే మొదటి స్థానంలో ఉన్నాడు. 93 సిక్సర్లను ఆస్ట్రేలియా మీద కొట్టి.. అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గేల్ ఇంగ్లాండ్ మీద 85.. ఆఫ్రిది శ్రీలంక మీద 63.. జై సూర్య పాకిస్తాన్ మీద 53.. అఫ్రిది ఇండియా మీద 51.. అఫ్రిది న్యూజిలాండ్ మీద 50.. ఆఫ్రిది 47.. రోహిత్ శర్మ వెస్టిండీస్ మీద 41.. చిగుంబర బంగ్లాదేశ్ మీద నలబై.. మార్ష్ సౌత్ ఆఫ్రికా మీద 40 సిక్సర్లు కొట్టారు.
FIFTY FOR ROHIT SHARMA!
50 runs off just 32 balls! pic.twitter.com/UpQ6Uzta2n
— Rehan 56 (@imrehan056) September 30, 2026