Flydubai flight incident: ఫ్లై దుబాయ్ సంస్థకు సంబంధించిన విమానం ఇజ్రాయిల్ వెళ్తుండగా కో పైలట్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పైలట్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ తోటి ప్రయాణికులను అతడు కాపాడాడు. విమానాన్ని హైజాక్ కాకుండా అడ్డుకున్నాడు. స్మిత్ మచ్చర్ చేసిన సాహసం యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కాక్ పిట్ లో జరిగిన దారుణం ప్రపంచానికి తెలిసింది. తన ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా మచ్చర్ తీవ్రమైన పోరాటం చేశాడు. రక్తం కారుతున్నప్పటికీ.. ప్రయాణికులను కాపాడాడు.
ఒక మహిళ వీరోచితమైన పోరాటం
స్మిత్ మచ్చర్ ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలికి పాటుకు గురి చేసింది. ఈ సంఘటన నేపథ్యంలో సరిగ్గా 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక వ్యవహారం తెర మీదకి వచ్చింది. నాడు జరిగిన ఘటనలో ఒక మహిళ వీరోచితమైన పోరాటం చేసింది. నీర్జా భనోట్ మన దేశానికి చెందిన ఫ్లైట్ పర్సర్. 1963 సెప్టెంబర్ 7 వ తేదీన చండీగఢ్ ప్రాంతంలో జన్మించారు. మోడల్గా ఆమె పని చేశారు. ఆ తర్వాత Pan am అనే విమానయాన సంస్థలో ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేసింది. ఆ తర్వాత సీనియర్ ఫ్లైట్ పర్సర్ గా ఎదిగింది.
కరాచీ విమానాశ్రయంలో హైజాక్
1986 సెప్టెంబర్ ఐదున Pan Am విమానం పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయంలో హైజాక్ అయ్యింది. ఆ సమయంలో 22 సంవత్సరాల నీర్జా ప్రయాణికుల భద్రత కోసం ధైర్యంగా వ్యవహరించింది. అత్యవసరమైన పరిస్థితిలో పలువురు ప్రయాణికులు బయటపడే విధంగా సహాయం చేసింది. ముగ్గురు పిల్లల ప్రాణాలను రక్షించే క్రమంలో హైజాకర్ల కాల్పులకు గురైంది. ప్రాణాలు కోల్పోయింది. ఆమె ధైర్య సాహసాలను మెచ్చి భారత ప్రభుత్వం మరణం అనంతరం అశోక చక్ర పురస్కారంతో ఆమెను గౌరవించింది. నీర్జా భనోట్ కేవలం విమాన సిబ్బంది మాత్రమే కాదు. తన ప్రాణాలను త్యాగం చేసి వందల మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ధైర్యానికి ప్రతీక.
సినిమాగా వచ్చింది
సరిగ్గా మూడు దశాబ్దల తర్వాత నీర్జా భనోట్ కథ సినిమాగా వచ్చింది. 2016లో రామ్ మధ్వాని దర్శకత్వంలో నీర్జా అనే హిందీ చిత్రం బయోపిక్ లాగా విడుదలైంది. సోనం కపూర్ నీర్జా పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా 1986లో జరిగిన ఘటన చాలామందికి తెలిసింది. అయితే ఈ సినిమాకు మించి అసలు ఆమె కథలో ఏముందంటే.. ఆమె మొదటి నుంచి హీరో కాదు.. ఒక సాధారణ యువతి.. మోడల్.. కూతురు.. భార్య.. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న మహిళ.. తన కెరియర్ అందంగా నిర్మించుకోవాలని ప్రయత్నించిన యువతి.. కానీ అసాధారణమైన పరిస్థితి ఆమె ముందుకు వచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయం చరిత్ర పుటలో నిలబెట్టాయి. ఫ్లై దుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చ ఎదుర్కొన్న కాక్ పిట్ ఘటన తర్వాత నీర్జా భనోట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
నలభై ఏళ్ల తర్వాత కూడా
ఈ రెండు గంటలు ఒకే విధంగా లేవు. 1986లో నీర్జా విమానం హైజాక్ అయింది. స్మిత్ మచ్చర్ పైలట్ గా విమానంలో హింసాత్మక ఘటన జరిగింది. కానీ ఈ రెండు ఘటనల్లో ఒక సామాన్యత ఉంది. ప్రమాదం వచ్చినప్పుడు విమాన సిబ్బంది తమ వ్యక్తిగత భద్రత కంటే ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే నలభై ఏళ్ల తర్వాత కూడా నీర్జా భనోట్ కథ ప్రస్తావనకు వస్తోంది.