Homeబిజినెస్Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే!

Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే!

Xiaomi 17T Price ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi తన 17T స్మార్ట్‌ఫోన్ ధరను భారత్‌లో మరోసారి పెంచింది. ఇప్పటికే ఒకసారి ధర పెంచిన కంపెనీ.. తాజాగా మరోసారి రెండు వేరియంట్లపై రూ.5,000 చొప్పున ధర పెంచింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పండుగ సీజన్ సేల్స్ ప్రారంభానికి ముందే Xiaomi 17T కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. రూ.69,999 నుంచి ప్రారంభం Xiaomi 17T […]

Xiaomi 17T Price ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi తన 17T స్మార్ట్‌ఫోన్ ధరను భారత్‌లో మరోసారి పెంచింది. ఇప్పటికే ఒకసారి ధర పెంచిన కంపెనీ.. తాజాగా మరోసారి రెండు వేరియంట్లపై రూ.5,000 చొప్పున ధర పెంచింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పండుగ సీజన్ సేల్స్ ప్రారంభానికి ముందే Xiaomi 17T కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

రూ.69,999 నుంచి ప్రారంభం

Xiaomi 17T 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పటివరకు రూ.64,999గా ఉండగా.. తాజా పెంపుతో రూ.69,999కు చేరింది. ఇక 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999 నుంచి రూ.74,999కు పెరిగింది. ఈ కొత్త ధరలు Xiaomi అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు Amazon Indiaలోనూ కనిపిస్తున్నాయి.

వాస్తవానికి Xiaomi 17T ఈ ఏడాది జూన్‌లో భారత్‌లో లాంచ్ అయినప్పుడు 256GB వేరియంట్ ధర రూ.59,999గా, 512GB వేరియంట్ ధర రూ.64,999గా నిర్ణయించారు. ఆ తర్వాత జూలైలో రెండు వేరియంట్లపై రూ.5,000 చొప్పున ధర పెరిగింది. ఇప్పుడు మరోసారి రూ.5,000 పెంచడంతో లాంచ్ ధరతో పోలిస్తే ఫోన్ ఏకంగా రూ.10,000 వరకు ఖరీదైంది.

అదిరిపోయే డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్

Xiaomi 17Tలో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లేకు Corning Gorilla Glass 7i రక్షణను అందించారు. పనితీరు కోసం MediaTek Dimensity 8500-Ultra చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 12GB LPDDR5x RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ లభిస్తుంది.

Leica కెమెరాలు, భారీ బ్యాటరీ

ఫోటోగ్రఫీ కోసం Xiaomi 17Tలో Leica-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Light Fusion 800 మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు.

ఇక ఫోన్‌లో 6,500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Black, Blue, Violet రంగుల్లో Xiaomi 17T అందుబాటులో ఉంది.

అయితే తాజా ధర పెంపుపై Xiaomi నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రిటైల్ భాగస్వాములకు పంపినట్లు చెబుతున్న ఓ పత్రం ద్వారా ధరల మార్పు వెలుగులోకి వచ్చింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper