Aadarsa Kutumbam: సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ క్రేజీ కాంబినేషన్ పై మార్కెట్ లో మామూలు రేంజ్ క్రేజ్ లేదు. ముందుగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అప్పటికి పూర్తి అయ్యే పరిస్థితి లేకపోవడం తో అక్టోబర్ 9 కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రొమోషన్స్ మొదలుపెట్టేశారు. అందులో భాగంగా త్రివిక్రమ్, వెంకటేష్ , శ్రీనిధి శెట్టి కలిసి యాంకర్ సుమ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ ఇంటర్వ్యూ లో వెంకటేష్ , త్రివిక్రమ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని బాగా ఆటపట్టించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ నుండి శ్రీనిధి పై నాన్ స్టాప్ గా పంచులు పడుతూనే ఉన్నింది. వెంకటేష్ గారు ప్రతీ సన్నివేశాన్ని కేవలం ఒక్క టేక్ లోనే పూర్తి చేస్తాడని , కానీ శ్రీనిధి కి ప్రతీసారీ కథ మొత్తం చెప్పాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచులు వేసాడు. అందుకు శ్రీనిధి వెంకటేష్ లాంటి సింగిల్ టేక్ ఆర్టిస్టు ముందు అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలంటే , ఆ మాత్రం స్టోరీ డిటైలింగ్ తెలుసుకోవాలి కదా అని అంటుంది. అంతే కాకుండా శ్రీనిధి శెట్టి కి ఉన్నటువంటి మరో అలవాటు గురించి ప్రస్తావిస్తూ త్రివిక్రమ్ , విక్టరీ వెంకటేష్ ఆమెని ఆట పట్టించారు. సెట్స్ లో ఉన్నప్పుడు మా భుజాలపై కొడుతూ ఊరికే విసిగించేది అని త్రివిక్రమ్ అనడం , అది వెంకటేష్ శ్రీనిధి భుజం పై కొడుతూ రీ క్రియేట్ చేయడం చాలా ఫన్నీ గా అనిపించింది.
అంత పెద్ద స్టార్స్ తో శ్రీనిధి లాంటి యంగ్ హీరోయిన్ ఇంతటి జోవియల్ గా కలిసిపోయి మాట్లాడడం ని చూస్తుంటే , ఆమె సెట్స్ లో ఎంత ఫన్నీ గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈమె తెలుగు లో ‘హిట్ 3’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె సీరియస్ యాంగిల్ లోనే కనిపించింది. కానీ ‘ఆదర్శ కుటుంబం’ లో ఈమె లోని ఫన్నీ యాంగిల్ ని చూడబోతున్నారని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై ఆడియన్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే మాత్రం వెంకటేష్ ఖాతాలో మరో 300 కోట్ల గ్రాసర్ ఉండబోతుంది అనుకోవచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.